
Mallemala entertainments Vs Avinash : ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.సుమారుగా పదేళ్ల నుండి ఈ షో విరామం లేకుండా కొనసాగుతుంది, ఈ షో నుండి పాపులరైన కమెడియన్స్ అందరూ నేడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా గొప్పగా రాణిస్తున్నారు.హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, చంటి, గెటప్ శ్రీను మరియు రచ్చ రవి వంటి టాప్ కమెడియన్స్ జబర్దస్త్ నుండి వచ్చిన వారే.
అంతమందికి జీవితాన్ని ఇచ్చిన ఈ జబర్దస్త్ షో ఇప్పుడు విమర్శలకు గురి అవుతుంది.కారణం అక్కడ పని చేసిన కమెడియన్స్ ని ‘మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్’ తొక్కేస్తుందనే.ముఖ్యంగా ముక్కు అవినాష్ ని జబర్దస్త్ యాజమాన్యం ఎన్నో అవమానాలకు గురి చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా కొనసాగుతున్న సమయం లోనే ముక్కు అవినాష్ కి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది.
అయితే ఒక్కసారి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ని వదిలి బయటకి వెళ్తే మళ్ళీ ఎంట్రీ ఉండదు.శాశ్వతంగా తలుపులు మూసుకున్నట్టే,అంతే కాదు షో మధ్యలో నుండి వెళ్ళిపోతే సదరు కమెడియన్ పది లక్షల రూపాయిలు జరిమానా కట్టాల్సి ఉంటుంది.అవినాష్ కి బిగ్ బాస్ లో అవకాశం వచ్చినప్పుడు అతని చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, ప్రముఖ యాంకర్ శ్రీముఖి సహాయం తో జబర్దస్త్ యాజమాన్యం కి పది లక్షల రూపాయిలు కట్టి బయటకి వచ్చాడు.

అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవినాష్ ని ఈటీవీ గడప కూడా తొక్కనివ్వకుండా చేసిందట మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్.ఆ సమయం లో అవినాష్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాడు.తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకోబోయాను అని పలుమార్లు ఆయన చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఆ సమయం లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొనే అవకాశం దక్కింది.
అప్పటి నుండి ఆయన స్టార్ మా ఛానల్ లోనే పని చేస్తూ నిలదొక్కుకున్నాడు.అయితే రీసెంట్ గానే ‘BB జోడి’ లో పాల్గొన్న జంటలను ప్రతీ శనివారం ప్రసారమయ్యే ‘సుమ అడ్డా’ కార్యక్రమానికి ఆహ్వానించారు.అఖిల్ – తేజస్విని జోడి పాల్గొనింది, మరో పక్క అరియానా మాత్రమే పాల్గొన్నది, ఆమెకి జంటగా చేసిన అవినాష్ మాత్రం కనిపించలేదు. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు అవినాష్ కి ఈటీవీ లో శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయి అని.అందుకు కారణం మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్.