
Balakrishna : సినిమాల్లో కంటే బుల్లితెరపైనే ఇప్పుడు బాలయ్య హంగామా సృష్టిస్తున్నారు. ‘ఆహా’ వేదికపై ‘అన్ స్టాపబుల్’ ప్రొగ్రామ్ ను సక్సెస్ చేసిన ఆయన ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ జోష్ పెంచుతున్నాడు. తాజాగా ఆహా ద్వారా వస్తున్న ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ ప్రొగ్రామ్ లో పాల్గొన్నారు. ఇందులో బాలయ్య చేసిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారు. ఆయన వేసే సెటైర్లకు అక్కడున్న వారంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. అలాంటి బాలయ్య ముందు హీరో నవదీప్, హీరోయిన్ బిందుమాదవిలు కలిసి న్యూసెన్స్ క్రీయేట్ చేశారు. ఆయనకు పంచ్ వేసే క్రమంలో బోల్తా పడ్డారు. ఇంతకీ టీజర్ కార్యక్రమంలో ఏం జరిగిందంటే?
సమాజంలో ఫోర్ట్ ఎస్టేట్ గా భావిస్తున్న మీడియా ను బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే కోణంలో ‘న్యూసెన్ష్ ’నే వెబ్ సిరీస్ రెడీ అయింది. ఓవైపు స్వార్థ రాజకీయాలు, మరోవైపు అవినీతి పోలీసు అధికారుల మధ్య వాస్తవాలను కప్పిపుచ్చే కొందరు రిపోర్టులు ఎలా ఉంటారనేది ఈ సిరీస్ కథాంశం. ఇందులో జర్నిలిస్టుగా నవదీప్, టీవీ రిపోర్టర్ గా బిందుమాధవి నటించారు. నవదీప్ చాలా రోజుల తరువాత ఈ సినిమాలో కీలకంగా నటించడంతో సినిమాపై హోప్స్ పెరిగాయని అంటున్నారు.
‘ఆహా అన్ స్టాపబుల్ ’ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన బాలయ్య ఇప్పుడు ఆ వేదిక నుంచి వస్తున్న ‘న్యూసెన్స్’ టీజర్ సందర్భంగా హంగా సృష్టించారు. ముందుగా ‘ఇండియన్ ఐడిల్’అనే కార్యక్రమం నిర్వహించే విధంగా ప్రొగ్రామ్ ను సెట్ చేశారు. ఇక్కడ పాట పాడడానికి నవదీప్, బింధుమాధవిలు వస్తారు.వాళ్లను చూడగానే బాలయ్య కళ్లు నలుచుకుంటూ ‘ఈమె బిందుమాధవేనా?’ అని అంటాడు. ఆ తరువాత నవదీప్ మైక్ అందుకొని ‘వన్.. టు.. త్రీ’ అంటాడు. కానీ సాంగ్ పాడలేడు.
ఆ తరువాత బిందుమాధవి ‘రావయ్య ముద్దుల మావ’ అనగానే జడ్జిగా ఉన్న బాలయ్య కుర్చీలోనుంచి లేని రావడానికి ట్రై చేస్తాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా ఘోల్లున నవ్వేస్తారు. ఆ తరువాత నవదీప్ మైక్ తీసుకొని ‘ఏందమ్మి మదనపల్లిలో నేను పాడిందే పాట.. ఆడిందే ఆట.. అంటివి.. ఇడికొచ్చాక రూటు మార్చినవ్ ఏంది కథా..? దీంతో వెంటనే బాలయ్య కలుగజేసుకొని ఏంటయ్యా ఈ నాన్సెన్స్.. అని అంటాడు. అప్పుడు బిందుమాధవి రిప్లై ఇస్తూ ‘సార్ నాన్సెన్స్ కాదు సార్.. న్యూసెన్స్’ అని అంటుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు కూడా చూడండి..
