Delhi Pigeons (1)
Delhi Pigeons: దేశరాజధాని ఢిల్లీలో పావురాలు(Pegions)ఎక్కువ. చారిత్ర కోటలు, నిర్మాణాలు, నదుల సమీపంలో పావురాలు ఎక్కువగా నివాసం ఉంటున్నాయి. పర్యాటకులకు ఆహ్లాదం పంచే ఈ పావురాలు ఇప్పడు ప్రమాదకరంగా మారుతున్నాయి. సాధారణంగా పావురాలు కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని సాధారణంగా చెబుతారు. పావురాల విసర్జిత పదార్థాలు లేదా ఈకల నుంచి గాలిలో కలిసే సూక్ష్మ కణాల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అలర్జీలు లేదా ఇన్ఫెక్షన్లు(Infections) వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు గతంలో హెచ్చరించారు. పావురాల వల్ల క్రిప్టోకాకస్(Criptocacs) వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా సిట్టాకోసిస్ వంటి బ్యాక్టీరియల్ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అయితే ఇటీవల పావురాలలో కొత్త వైరస్‌ను గుర్తించారు. క్లమీడియా సిట్టసీ అనే బ్యాక్టీరియా పావురాల రెట్టలు, రెక్కల్లో ఉన్నట్లు ధ్రువీకరించారు. ఈ వైరస్ ద్వారా సిట్టకోసిస్ అనే జ్వరం వస్తుందని పరిశోధనలో తేలింది. ఇది ఇంచుమించు కరోనా లక్షణాలను పోలి ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఢిల్లీ మున్సిపల్ అధికారులు మాత్రం కొత్త వైరస్‌పై అప్రత్తమయ్యారు. పావురాల పెంపకంపై ఆంక్షలు విధించాలన్న ఆలోచనలో ఉన్నారు.
Also Read: తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. కలెక్టర్ల సదస్సులో సీఎం సంచలన ప్రకటన!
పావురాలు ప్రమాదకరమే..
పావురాల వల్ల వచ్చే వైరస్ ప్రమాదాల గురించి సాధారణంగా ఆరోగ్య నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తారు. పావురాలు సాధారణంగా శాంతి చిహ్నంగా పరిగణించబడినప్పటికీ, వీటి రెట్టలు, ఈకలు లేదా గూళ్ల నుంచి వచ్చే ధూళి ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇవి ప్రధానంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి.
సిట్టాకోసిస్ (Psittacosis): ఇది క్లామిడోఫిలా సిట్టాసి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది, దీనిని పావురాలు తమ రెట్టలు లేదా శ్వాస ద్వారా వ్యాప్తి చేయవచ్చు. ఈ వ్యాధి మనుషుల్లో జ్వరం, దగ్గు, తలనొప్పి, న్యూమోనియా వంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది గాలి ద్వారా సంక్రమిస్తుంది, ముఖ్యంగా పావురాల రెట్టలు ఎండిపోయి ధూళిగా మారినప్పుడు.
క్రిప్టోకాకస్ (Cryptococcosis): ఇది క్రిప్టోకాకస్ నియోఫార్మన్స్ అనే ఫంగస్ వల్ల వస్తుంది, ఇది తరచూ పావురాల రెట్టల్లో కనిపిస్తుంది. ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి చేరి ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది, ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో తీవ్రమవుతుంది.
హిస్టోప్లాస్మోసిస్ (Histoplasmosis): హిస్టోప్లాస్మా క్యాప్సులేటం అనే ఫంగస్ వల్ల వచ్చే ఈ వ్యాధి కూడా పావురాల రెట్టల నుంచి వ్యాపిస్తుంది. ఇది శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించి జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను సృష్టిస్తుంది.
అలర్జీలు మరియు ఆస్తమా: పావురాల ఈకలు లేదా రెట్టల నుంచి వచ్చే సూక్ష్మ కణాలు గాలిలో కలిసి అలర్జీ లేదా ఆస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలను ప్రేరేపిస్తాయి. దీర్ఘకాలంగా ఈ కణాలకు గురైతే హైపర్‌సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అనే పరిస్థితి కూడా రావచ్చు.
ప్రమాద కారకాలు:
పావురాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు (ఇళ్ల కిటికీలు, బాల్కనీలు, పాత కట్టడాలు)లో రెట్టలు పేరుకుపోవడం.
ఎండిన రెట్టల నుంచి వచ్చే ధూళిని పీల్చడం.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు (పిల్లలు, వద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు) ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.
నివారణ చర్యలు:
పావురాలు గూడు కట్టకుండా నిరోధించడానికి ఇళ్లలో జాలర్లు లేదా కిటికీలు మూసివేయడం.
పావురాల రెట్టలను తొలగించేటప్పుడు మాస్క్, గ్లౌజ్‌లు ధరించడం.
గాలి చొరబడేలా గదులను శుభ్రంగా ఉంచడం.
పావురాలను ఇళ్లలో పెంచడం లేదా ఆహారం వేయడం మానేయడం.