Ram Charan's heroine
Ram Charan : కొంతమంది హీరోయిన్స్ కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. కొన్నాళ్ళకు వాళ్ళను ఆడియన్స్ మర్చిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు అమీ జాక్సన్(Amy Jackson). లండన్ దేశానికీ చెందిన ఈ అమ్మాయి, తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. 2010 వ సంవత్సరం లో విడుదలైన ‘మద్రాసిపట్టణం’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన అమీ జాక్సన్, ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ ఇచ్చి ‘ఏక్ దీవానా తా’ అనే హిందీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో సంచలన విజయం సాధించిన ‘ఏ మాయ చేసావే’ అనే సినిమాకు ఇది రీమేక్. కానీ తెలుగు, తమిళ భాషల్లో వచ్చినంత రెస్పాన్స్ ఈ సినిమాకు హిందీ రాలేదు కానీ, అమీ జాక్సన్ కి మాత్రం మంచి పేరొచ్చింది.
Also Read : రామ్ చరణ్ బర్త్ డే కి ఫ్యాన్స్ చొక్కలు చించుకోవాల్సిందేనా..?
అలా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈమె 2014 వ సంవత్సరం లో విడుదలైన రామ్ చరణ్(Global Star Ram Charan) ‘ఎవడు’ సినిమాతో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ, ఆడియన్స్ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. అలా డైరెక్టర్ శంకర్(Shankar Shanmugham) దృష్టిలో పడింది. శంకర్ తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని అనుకున్న ‘ఐ’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అమీ జాక్సన్ పేరు దేశమంతతా మారు మోగిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలా కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు జార్జ్ అనే అతన్ని 2019 వ సంవత్సరం లో ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు.
ఆ తరవాత కొంతకాలం కొడుకు తో ఒంటరి జీవితం గడిపిన ఈమె 2022 వ సంవత్సరం లో వెస్ట్ విక్ అనే అతన్ని ప్రేమించి అతనితో డేటింగ్ చేసింది. గత ఏడాది వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులిద్దరూ రీసెంట్ గానే ఒక కొడుకుకి జన్మనిచ్చారు. అతడికి ‘ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్ విక్’ గా నామ కారణం చేసారు. తమ కొడుకుని ముద్దాడుతూ ఈ దంపతులు కలిసున్న ఫోటోని షేర్ చేయగా అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అమీ జాక్సన్ కి ఈ సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం విరామం ఇచ్చిన అమీ జాక్సన్ గత ఏడాది ‘మిషన్ :: చాప్టర్ 1’, ‘క్రాక్’ వంటి చిత్రాల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. అవకాశాలు మళ్ళీ బాగా వస్తున్న సమయంలో గర్భం దాల్చడంతో విరామం ఇచ్చింది. భవిష్యత్తులో సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.
Also Read : పెళ్లి కాకముందే గర్భం దాల్చిన రామ్ చరణ్ హీరోయిన్..ఫోటోలు వైరల్!