Variety Marriage: వరుడు కావలెను.. ఇలాంటి ప్రకటనలు పత్రికల్లో తరచూ చూస్తుంటాం. ఇక ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో చాలా మ్యాట్రిమొనీ యాప్స్ వచ్చాయి. దీంతో పత్రికల్లో ప్రకటనలు కాస్త తగ్గాయి. అయితే కర్ణాటకలో వరుడు కావాలెను అనే ఓ ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. అందుకు కారణం తెలిస్తే మీరూ షాక్ అవుతారు. మూడు దశాబాద్దల క్రితం మరణించిన తమ కూతురు కోసం ఓ కుటుంబం వరుడిని వెతుకుతోంది. వరుడికి ఉండాల్సిన అర్హతలతో ప్రకటనలు ఇస్తోంది. వారికి నచ్చితేనే పెళ్లికి అంగీకరిస్తారట. చదవడానికి వింతగా ఉంది కదూ. ఇంతకీ వధువు తరపునవారికి ఎలాంటి వరుడు కావాలి? ఈ పెళ్లి తతంగం వెనుక అసలు కథేంటి తెలుసుకునేందుకు కర్ణాటకలోని పుత్తూరు వెళ్దాం.
30 ఏళ్ల క్రితమే మృతి..
కర్ణాటకలోని పుత్తూరులో ఓ కుటంబం వరుడు కావలెను అని ప్రకటన విడుదల చేసింది. ఇందులో బంగే రా గోత్రం.. కులల్ కులంలో పుట్టిన తమ కుమార్తెకు తగిన వరుడు కావాలని కోరారు. ఇంతవరకు ఓకే. కానీ, వధువు 30 ఏళ్ల క్రితం మరణించిందని పేర్కొన్నారు. ఇదే గోత్రంలో పుట్టిన ఏ కులంలో పుట్టి, గోత్రం ఏదైనా పర్వాలేదని తెలిపారు. 30 ఏళ్ల క్రితం మరణించి ఉండాలని పేర్కొన్నారు.
ఆత్మలకు పెళ్లి చేసే ఆచారం..
ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రేతాత్మల పెళ్లి తంతుపై ప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే.. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని తులునాడు ప్రాంతంలో మరణించిన వారి ఆత్మలకు పెళ్లి చేసే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ప్రేత మడువే అని దీనిని పిలుస్తారు. ఈ ఆచారాన్ని దాదాపుగా పెళ్లి తరహాలోనే జరిపిస్తారు.
ముహూర్తం కూడా ఫిక్స్..
ఇదిలా ఉంటే తాజాగా వైరల్ అవుతున్న వరుడు కావలెను ప్రకటనలో కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నారు. ఈ ప్రకటనకు మంచి స్పందనే వచ్చింది. 50 మంది వరకు వధువు కుటుంబ సభ్యులను సంప్రదించారట. వారిలో సరైన సంబంధాన్ని ఎంపిక చేసుకుని వరుడి ప్రేతాత్మతో, తమ కుమార్తె ప్రేతాత్మకు వివాహం చేయనున్నారు. ఇందుకోసం పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశామని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు.