
సాధారణంగా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే బ్యాంకు ద్వారా ఖాతాదారుడు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నామినీకి డబ్బులు విత్ డ్రా చేసుకునే ఛాన్స్ లభిస్తుంది. ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి బ్యాంకు ద్వారా మరో వ్యక్తి డబ్బులు విత్ డ్రా చేసే అవకాశం ఉండదు. అందువల్ల బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నగదును విత్ డ్రా చేయడానికి బీహార్ లో శవం బ్యాంకుకు వెళ్లింది.
Also Read: ‘ఆచార్య’ మూవీలోని మరో రహస్యాన్ని బయటపెట్టిన చిరంజీవి
వినడానికి వింతగా అనిపిస్తున్న ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే పాట్నాలోని సిగ్రియవాన్ అనే గ్రామంలో 55 సంవత్సరాల వయస్సు ఉన్న మహేశ్ అనే వ్యక్తి జీవనం సాగించేవాడు. అతనికి కుటుంబ సభ్యులు, బంధువులు లేరు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మహేశ్ అనారోగ్యం వల్ల మృతి చెందాడు. దీంతో గ్రామస్తులు అతనికి అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు.
Also Read: కొడాలి నాని కౌంటర్ కు నందమూరి బాలక్రిష్ణ ఎన్ కౌంటర్
అయితే అంత్యక్రియల కోసం కావాల్సిన డబ్బు గ్రామస్తులకు జమ కాలేదు. ఆ సమయంలో గ్రామస్తులు అతనికి కెనరా బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఉందని అతని బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేద్దామని బ్యాంక్ మేనేజర్ ను కలిసి అసలు విషయం చెప్పారు. మహేష్ బ్యాంక్ అకౌంట్ లో లక్ష రూపాయలు ఉండగా మహేష్ ఎవరినీ నామినీగా పేర్కొనకపోవడంతో బ్యాంకు మేనేజర్ డబ్బు విత్ డ్రా చేయడానికి అంగీకరించలేదు.
మరిన్ని వార్తల కోసం:జనరల్
దీంతో గ్రామస్తులు శవాన్ని బ్యాంకుకు తీసుకొని వచ్చి బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యక్తే బ్యాంకుకు వచ్చాడని డబ్బు విత్ డ్రా చేసి ఇవ్వాలని కోరారు. మేనేజర్ ఎంత చెప్పినా గ్రామస్తులు వినకపోవడంతో మేనేజర్ తన పర్సనల్ ఖాతాలో 10,000 రూపాయలు విత్ డ్రా చేసి ఇవ్వగా గ్రామస్తులు ఆ డబ్బుతో అంత్యక్రియలు నిర్వహించారు.