https://oktelugu.com/

జబర్దస్త్ కి వస్తానంటే వద్దంటున్నారట !

ఈటీవీలో ఏడేళ్ల క్రితం మొదలైన “జబర్దస్త్” కామెడీ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది జీవితాలు మారిపోయాయని చెప్పుకోవచ్చు. జడ్జీలుగా నాగబాబు, రోజా, యాంకర్స్ గా అనసూయ, రష్మీ, కంటెస్టెంట్లుగా ధనరాజ్, వేణు, చంటి, అభి, రాకెట్ రాఘవ,సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ , శ్రీను, చమ్మక్ చంద్ర,అవినాష్,హైపర్ ఆది ఇలా మరికొందరు షో విజయంలో తమవంతు పాత్ర పోషించారు. Also Read:  ‘సమంత’ వద్దు అంటున్న నాగచైతన్య […]

Written By:
  • admin
  • , Updated On : January 6, 2021 / 05:58 PM IST
    Follow us on


    ఈటీవీలో ఏడేళ్ల క్రితం మొదలైన “జబర్దస్త్” కామెడీ షో ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతూ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది జీవితాలు మారిపోయాయని చెప్పుకోవచ్చు. జడ్జీలుగా నాగబాబు, రోజా, యాంకర్స్ గా అనసూయ, రష్మీ, కంటెస్టెంట్లుగా ధనరాజ్, వేణు, చంటి, అభి, రాకెట్ రాఘవ,సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ , శ్రీను, చమ్మక్ చంద్ర,అవినాష్,హైపర్ ఆది ఇలా మరికొందరు షో విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

    Also Read:  ‘సమంత’ వద్దు అంటున్న నాగచైతన్య !

    జబర్దస్త్ షో కి లభించిన ఆదరణ చూసి మిగిలిన చానెల్స్ వాళ్ళు దానికి కాపీగా షోలు ప్రయత్నించారు, కానీ సక్సెస్ సాధించలేక చతికలపడ్డారు. వివిధ కారణాలతో అనూహ్యంగా నాగబాబు జబర్దస్త్ షో నుండి బయటకి వచ్చి జి తెలుగులో ‘అదిరింది’షో స్టార్ట్ చేసారు. ఆయనతో పాటు కొందరు కంటెస్టెంట్లు కూడా వచ్చేసారు. వారిలో చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ మరికొందరు ఉన్నారు. అయితే మొదట్లో అదిరింది షో పర్వాలేదనిపించింది. కానీ ఆ సక్సెస్ ని కొనసాగించాలేకపోతుంది. అసలు ఈ షో ఉంటుందా ఆగిపోతుందా అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతుంది.

    Also Read: ‘రాధేశ్యామ్’ టీజర్ వచ్చేస్తోందట.. శాంతించిన ఫ్యాన్స్ !

    ఇలాంటి అయోమయ సమయంలో చమ్మక్ చంద్ర తిరిగి జబర్దస్త్ లోకి వెళ్లాలని ఆ షో నిర్వాహకులని సంప్రదింపులు జరిపారు. కానీ ఒకసారి తమని కాదని వెళ్ళిపోయాడనే కారణంతో జబర్దస్త్ యాజమాన్యం తిరస్కరించింది . చేతులు కాలాక ఆకులు పట్ట్టుకుంటే ప్రయోజనం ఉండదుగా అని కొందరంటున్నారట. ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక చమ్మక్ చంద్ర అయోమయంలో ఉన్నారని సమాచారం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్