https://oktelugu.com/

కొడాలి నాని కౌంటర్ కు నందమూరి బాలక్రిష్ణ ఎన్ కౌంటర్

సినిమాల్లో బాలయ్య పేల్చే డైలాగులకు థియేటర్లో విజిల్స్ పడుతాయి. ఆయన తొడగొడితే ట్రెయిన్ రివర్స్ లో వెళ్లిపోద్దీ.. ‘రాజకీయమైనా.. సినిమాలైనా తాను దిగనంత వరకేనని’ డైలాగులు పేల్చే హీరో కం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ తాజాగా నిజంగానే రెచ్చిపోయారు. సినిమా డైలాగులతో ఏపీ మంత్రి కొడాలి నానిని ఎన్ కౌంటర్ చేశాడు. Also Read: చంద్రబాబు, లోకేష్.. టీడీపీ మీడియా పరువు తీసిన కొడాలి నాని తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు, అల్లుడు లోకేష్ పై […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2021 / 05:35 PM IST
    Follow us on

    సినిమాల్లో బాలయ్య పేల్చే డైలాగులకు థియేటర్లో విజిల్స్ పడుతాయి. ఆయన తొడగొడితే ట్రెయిన్ రివర్స్ లో వెళ్లిపోద్దీ.. ‘రాజకీయమైనా.. సినిమాలైనా తాను దిగనంత వరకేనని’ డైలాగులు పేల్చే హీరో కం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ తాజాగా నిజంగానే రెచ్చిపోయారు. సినిమా డైలాగులతో ఏపీ మంత్రి కొడాలి నానిని ఎన్ కౌంటర్ చేశాడు.

    Also Read: చంద్రబాబు, లోకేష్.. టీడీపీ మీడియా పరువు తీసిన కొడాలి నాని

    తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు, అల్లుడు లోకేష్ పై బూతులతో విరుచుకుపడుతున్న ఏపీ మంత్రిని చెడుగుడు ఆడేశాడు. ‘నా సహనాన్ని పరీక్షించొద్దు.. ఉరికే నోరు పారేసుకోవడానికి నేను వట్టి మనిషిని కాదు.. అవసరమైతే చేతలు కూడా చూపిస్తా.. తస్మాత్ జాగ్రత్త’ అని బాలయ్య ఏపీ మంత్రిని హెచ్చరించిన వైనం సంచలనంగా మారింది.

    పేకాటలో దొరికితే ఏమవుతుంది? జైలుకు పోతారు.. 10వేల జరిమానా పడుతుతుంది అని ఒక ఏపీ మంత్రి అంటాడా? ఎంత దారుణం’ అంటూ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై బాలయ్య కౌంటర్లు వేశారు.

    Also Read: ట్విట్టర్ ద్వారానే పవన్ ‘రామతీర్థం’ నిరసన?

    చట్టమంటే గౌరవం లేకుండా పోయిందని..పేకాట ఆడితే తప్పేంటని మంత్రి అనడం దారుణమని అన్నారు. పిచ్చిపిచ్చివేశాలు వేయొద్దు.. జాగ్రత్త అంటూ బాలయ్య తనదైన సినిమాటిక్ శైలిలో వైసీపీ మంత్రి కొడాలి నానిని హెచ్చరించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్