Homeజాతీయంధోనీ టీమ్‌లో 13 మందికి కరోనా.. ఐపీఎల్‌పై నీలినీడలు!

ధోనీ టీమ్‌లో 13 మందికి కరోనా.. ఐపీఎల్‌పై నీలినీడలు!


భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఎన్నో వ్యయప్రయాసలు పడి ఎడాది దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) లో ప్లాన్‌ చేసిన ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన మొదలవ్వాల్సిన ఈ మెగా టోర్నమెంట్‌ సాఫీగా సాగడం అనుమానంగా మారింది. లీగ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్కే) టీమ్‌పై కరోనా పంజా విసిరింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న ఆ జట్టులో ఏకంగా 13 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒకరు టీమ్‌ పేసర్ కాగా.. మరో 12 మంది సహాయ సిబ్బంది. అత్యంత సురక్షిత వాతావారణంలో దుబాయ్‌లో ఉన్న ఈ జట్టులో ఒకే సారి ఇంతమందికి కరోనా సోకడం కలకలం సృష్టించింది.

Also Read: ‘గాల్లో’ ఎగరాలంటే మాస్కు ఉండాల్సిందే..!

చెన్నై జట్టు ఈ నెల 21వ తేదీన ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకుంది. యూఏఈ ప్రభుత్వం, బీసీసీఐ నిబంధనల ప్రకారం అప్పటి నుంచి వారం రోజుల పాటు కచ్చితమైన క్వారంటైన్‌లో ఉంది. ఆటగాళ్లు, సిబ్బంది టీమ్‌ హోటల్లో తమకు కేటాయించిన గదులకే పరిమితం అయ్యారు. కనీసం పక్క గదుల్లోకి కూడా ఎవ్వరూ రాలేదు. వారం రోజుల క్వారంటైన్‌ గురువారమే పూర్తి కావడంతో ప్రాక్టీస్‌కు రెడీ అయ్యారు. కానీ, ప్లేయర్లకు నిర్వహించిన మూడో టెస్టులో 13 మందికి పాజిటివ్‌ అని తేలడంతో అందరూ షాకయ్యారు. అయితే, కరోనా సోకిన వారి వివరాలను బోర్డు బహిర్గతం చేయలేదు. కానీ, ఇటీవలే టీమిండియాకు ఆడిన ఓ మీడియం పేసర్కు పాజిటివ్‌ వచ్చిందని తెలిసింది. సదరు ప్లేయర్ దీపక్‌ చహల్‌, శార్దుల్‌ ఠాకూర్లో ఒకరు అని అర్థమవుతోంది.

Also Read: అసమ్మతి నేతలపై సోనియా వేటు వేస్తారా?

ఇంతమందికి కరోనా సోకడం చెన్నై సూపర్ కింగ్స్‌ సన్నాహాలపైనే కాకుండా ఐపీఎల్‌ షెడ్యూల్‌ను కూడా ప్రభావితం చేసేలా ఉంది. ఎందుకంటే బీసీసీఐ రూపొందించిన గైడ్‌లైన్స్‌ ప్రకారం కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టుల్లో నెగెటివ్‌ వస్తేనే.. బయో బబుల్‌ లో ఇతర ప్లేయర్లను కలిసేందుకు అనుమతిస్తారు. మరో నాలుగు వారాల్లో టోర్నీ మొదలవుతున్న నేపథ్యంలో సీఎస్కేకు చెందిన 13 మంది రెండు వారాల పాటు హోటల్‌ గదులకే పరిమితం కానున్నారు. 12 మంది సపోర్ట్‌ స్టాఫ్‌ లేకపోతే చెన్నై టీమ్‌ సాధనపై ప్రభావం పడనుంది. బీసీసీఐ ఇప్పటికీ షెడ్యూల్‌ ఖరారు చేయలేదు. తాజా పరిణామంతో షెడ్యూల్‌ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. దాంతో, టోర్నీ అనుకున్న టైమ్‌లోనే మొదలవుతుందా? అంటే అనుమానమే!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version