https://oktelugu.com/

‘ఎన్టీఆర్’కి రాజకీయాలే వ్యాపారం అట !

‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తోన్న మూవీ కథ ఇదేనంటూ తాజాగా ఈ సినిమా కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో త్రివిక్రమ్ ఈ సినిమా కథ రాసుకున్నారని.. కాకపోతే కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి పలనాడు ప్రాంతం నేపథ్యాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ అని.. సినిమాలో ఎన్టీఆర్ కమర్షియల్ బిజినెస్ […]

Written By:
  • admin
  • , Updated On : August 28, 2020 / 07:49 PM IST
    Follow us on


    ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తోన్న మూవీ కథ ఇదేనంటూ తాజాగా ఈ సినిమా కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఓ హాలీవుడ్ సినిమా ప్రేరణతో త్రివిక్రమ్ ఈ సినిమా కథ రాసుకున్నారని.. కాకపోతే కథా నేపథ్యంలో తెలుగుతనం తేవడానికి పలనాడు ప్రాంతం నేపథ్యాన్ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎంటర్ టైనర్ అని.. సినిమాలో ఎన్టీఆర్ కమర్షియల్ బిజినెస్ మెన్ లా నటిస్తున్నాడని.. ఈ క్రమంలోనే పలనాడులోని ఒక పురాతన పాడు బడిన కోటలోని గుప్త నిధుల కోసం తారక్ ఇండియాకి వస్తాడని.. అయితే పక్కా బిజినెస్ మైండెడ్ అయిన హీరోకి ఇండియాలోని పాలిటిక్స్ కి మించిన బిజినెస్ లేదనిపిస్తోందట.

    Also Read: పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌

    దాంతో రాజకీయాలనే తన వ్యాపారంగా మలుచుకున్న హీరో కథే ఈ సినిమా కథ అని.. చివర్లో హీరో చేసిన ప్రతి చెడు పనికి ఒక మంచి ఉంటుందని.. అది ట్విస్ట్ గా రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి సెంటిమెంట్ లేని ఒక ఎన్నారైగా కనిపించబోతున్నాడు. పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, మొదటిసారి తన పూర్వీకులు కట్టించిన కోటలోని నిధి కోసం ఇండియాకి వస్తాడు. అలా తనకు ఏ మాత్రం అవగాహన లేని రాజకీయ నేపథ్యంలోకి డబ్బులు కోసం అడుగు పెట్టి.. నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయనే కోణాన్ని వ్యంగ్యంగా మలుచుకుని హీరో సినిమాని నడిపిస్తాడట.

    Also Read: సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కి సినిమా లేదు !

    మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాగానే వేరియేషన్స్ ఉండేలా కనిపిస్తున్నాయి. అన్నట్టు తారక్ పాత్రతో పాటు త్రివిక్రమ్ మరో కీలక పాత్రను కూడా రాస్తున్నాడని.. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, లేదా మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ నటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని.. అందులో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోవాలని చిత్రబృందం ఫిక్స్ అయిందని సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తోన్నారు.