Viral News: ఏదైనా ఒక స్థాయి వరకే బాగుంటుంది. పరిమితి దాటితే ఎదుటివారికి విసుగు వస్తుంది. ఆ కోపంలో వారేం చేస్తారో తెలియదు. కానీ దాని పర్యవసనాలను కచ్చితంగా భరించాల్సి ఉంటుంది. ఇలాంటి అనుభవమే ఆ ప్రాంత ప్రజలకు ఎదురైంది. దీంతో వారు తమకు ఇబ్బంది కలిగిస్తున్న ఆకతాయిలకు సరైన స్థాయిలో బుద్ధి చెప్పారు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తర్వాత చాలామంది ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ విన్యాసాల వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ విన్యాసాలు ఎదుటి వ్యక్తులను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. సోషల్ మీడియాలో వ్యాప్తిలో ఉన్న ఓ వీడియో ప్రకారం.. ఓ ఫ్లై ఓవర్ పై కొంతమంది యువకులు దారుణమైన స్టంట్ లు చేస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. వారికి సరైన స్థాయిలో గుణపాఠం నేర్పాలని భావించారు. ఇదే క్రమంలో ఆ ఫ్లై ఓవర్ నుంచి వారు నడుపుతున్న వాహనాలను ఒకసారి గా కింద పడేశారు. దీంతో ఆ వాహనాలు ధ్వంసమయ్యాయి. దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజధానిగా కొనసాగుతున్న బెంగళూరు లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బెంగళూరులోని నెలమంగల ప్రాంతంలో ఫ్లై ఓవర్ ఉంది. దీని మీదుగా భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బెంగళూరు సిటీకి శివారు ప్రాంతమైన ఈ ఫ్లైఓవర్ పై కొంతమంది ఆకతాయిలు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఆ విన్యాసాల వల్ల చుట్టుపక్కల ఉన్నవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రద్దీ రోడ్లు కావడంతో ప్రయాణికులు కూడా నరకం చూస్తున్నారు. దీంతో ఆ ఆకతాయిలకు బుద్ధి చెప్పాలని భావించిన స్థానికులు.. వారు నడుపుతున్న ద్విచక్ర వాహనాలను ఫ్లై ఓవర్ నుంచి కిందకు పడేశారు. దీంతో వారు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అలా కింద పడేసిన ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ ఘటన జరుగుతున్నప్పుడు స్థానికులు కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం బెంగళూరు పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు చర్యలు తీసుకున్నారు. అక్కడి సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా 36 మందిపై కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించారు. ఆ ద్వి చక్ర వాహనాలను కూడా వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రద్దీగా ఉండే రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అయితే ఈ విన్యాసాలు చేసిన యువకులు మొత్తం స్థానికంగా ఉన్న కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను చదువుతున్నట్టు తెలిసింది.
Public fury erupts in Nelamangala as angry locals toss two scooters off a flyover after spotting riders doing dangerous wheelie stunts. This #Bawal in #Bengaluru shows just how fed up people are with reckless behavior on the roads! #Karnataka pic.twitter.com/cd39xKBzbe
— Bawal hote rhenge (@bawalhoterhenge) August 18, 2024