https://oktelugu.com/

South Africa: వారెవ్వా సౌత్ ఆఫ్రికా. ఏకంగా భారత్ , ఆస్ట్రేలియానే మడత పెట్టి.. ప్రపంచ రికార్డు కొట్టింది..

సౌత్ ఆఫ్రికా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టుపై అత్యధిక సిరీస్ లు గెలిచిన టీం గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అది కూడా వరుసగా ట్రోఫీలు దక్కించుకొని సరికొత్త ఘనతను అందుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 19, 2024 8:54 am
    South Africa

    South Africa

    Follow us on

    South Africa: మిగతా ఫార్మాట్ లు ఎలా ఉన్నప్పటికీ.. టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్ జట్టు పై దక్షిణాఫ్రికా పై చేయి కొనసాగిస్తూనే ఉంది. గయాన వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఏకంగా 42 విక్టరీ సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్ 1-0 తేడాతో చేజిక్కించుకుంది. తొలి టెస్ట్ డ్రాగ ముగిసిన విషయం తెలిసిందే.

    ఈ సిరీస్లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టుపై అది కూడా వరుసగా అత్యధికంగా 10 సిరీస్ లు నెగ్గిన జట్టుగా ఆవిర్భవించింది. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల పేరు మీద ఉండేది. అటు భారత్, ఇటు ఆస్ట్రేలియా కూడా వెస్టిండీస్ జట్టు పైనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాయి.

    వెస్టిండీస్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు 33 టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఈ రెండు చెట్ల మధ్య తొలి టెస్ట్ సిరీస్ 1992లో జరిగింది. ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. ఆ తర్వాత జరిగిన 10 సిరీస్ లను దక్షిణాఫ్రికా సొంతం చేసుకోవడం విశేషం. ఈ వరుస విజయాలతో వెస్టిండీస్ జట్టు పై దక్షిణాఫ్రికా తిరుగులేని పై చేయి సాధించింది.

    ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టు తర్పణ టెస్ట్ మ్యాచ్ లలో ఎక్కువ వికెట్లు పడగొట్టిన స్పిన్ బౌలర్ గా ఘనత సృష్టించాడు. దక్షిణాఫ్రికా జట్టు తరపున 1949 -1960 మధ్యకాలంలో హ్యూ టే ఫీల్డ్ ఆడాడు. ఇతడు 170 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి రికార్డును కేశవ్ బద్దలు కొట్టాడు. ఈ సిరీస్లో కేశవ్ ఏకంగా 13 వికెట్లు నేల కూల్చాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.

    దక్షిణాఫ్రికా ఈ ఘనత సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లు వెతుతున్నాయి. దక్షిణాఫ్రికా జట్టు మిగతా టెస్ట్ మ్యాచ్ లలో కూడా ఇదే స్థాయిలో ప్రదర్శన చేసి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సొంతం చేసుకోవాలని ఆ దేశానికి చెందిన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని ఆక్రమించాలని కోరుతున్నారు.