Rajasthan: ఆ చిన్నారి వయసు 22 నెలలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో జన్మించాడు. అనారోగ్యం, శారీరక ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలను గుర్తించిన తల్లిదండ్రులు బాబుకు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో వైద్యులు షాకింగ్ విషయం చెప్పారు. అరుదైన వ్యాధితో చిన్నారి బాధపడుతున్నాడని తెలిపారు. అతడికి ఖరీదైన ఇంజక్షన్ ఇస్తేనే సాధారణ జీవితం గడుపుతాడని లేకుంటే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. ఆ చిన్నారి ఎవరు, అతడికి సోకిన వ్యాధి ఏమిటి.. ఇంజక్షన్ ఖరీదు ఎంత అనే వివరాలు తెలుసుకుందాం.
రాజస్థాన్ చిన్నారి..
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన హృదయాంశ్(22 నెలలు) అదుపైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్–2తో పోరాడుతున్నాడు. ఇది చాలా అరుదుగా సోకుతుందని వైద్యులు తెలిపారు. దీని చికిత్స కోసం రూ.17.5 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని పేర్కొన్నారు. అది ఇవ్వని పక్షంలో వెన్నుపూస వంగిపోయి సాధారణ జీవితం గడపలేరని వెల్లడించారు.
క్రౌడ్ ఫండింగ్..
చిన్నారి తండ్రి నరేశ్‌కుమార్ ధోల్‌పూర్‌లోని మానియా పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్. కుమారుడి చికిత్సకు ఖరీదైన జోల్జెన్సా ్మ అనే రూ.17.5 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరం కావడం.. అది కూడా బాబుకు 24 నెలలు నిండక ముందే ఇవ్వాల్సి ఉండడంతో పోలీస్ అధికారి అయిన నరేశ్‌కుమార్ క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నించారు.
అనూహ్య స్పందన..
చిన్నారి అరుదైన వ్యాధి గురించి తెలుసుకున్న అందరూ తోచిన సాయం చేయడానికి ముందుకు వచ్చారు క్రికెట్ దీపక్ చహర్, నటుడు సోనూసూద్, ఎన్జీవోలు, సామాన్యులు కూడా తమవంతుగా చిన్నారికి సాయం చేశారు. దీంతో తక్కువ సమయంలోనే ఇంజక్షన్‌కు అవసరమైన ఫండ్ సమకూరింది.
ఇటీవలే అందిన ఇంజక్షన్..
దీంతో నరేశ్‌కుమార్ డబ్బులతో చిన్నారి హృదయాంశ్‌కు చికిత్స చేస్తున్న జైపూర్‌లోని జేకే లోన్ హాస్పిట్ సీనియర్ వైద్యుడు డాక్టర్ ప్రియాంషు మాథును సంప్రదించాడు. ఆయన చికిత్సకు అవసరమైన ఆ ఇంజక్షన్‌ను తెప్పించి ఇటీవలే చిన్నారికి వేయించారు.
అద్భుతమే జరిగింది..
సాధారణంగా రెండు నెలల్లో రూ.17.5 కోట్లు జమచేయడం అంద మామూలు విషయం కాదు. చిన్నారి అదృష్టంతో నరేశ్‌కుమార్ చేపట్టిన క్రౌడ్ ఫండింగ్‌తో అద్భుతమే జరిగింది. నెల వ్యవధిలోనే కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. దీంతో చిన్నారికి సమయానికి అవసరమైన చికిత్స అందింది.