https://oktelugu.com/

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే మెహ్రీన్ తల్లి అయ్యిందా? సంచలనంగా స్టార్ హీరోయిన్ పోస్ట్!

ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడిన మెహ్రీన్ పై మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మెహ్రీన్ స్పందించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 15, 2024 / 08:58 AM IST

    Mehreen Pirzada

    Follow us on

    Mehreen Pirzada: హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాడ ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. మెహ్రీన్ గర్భాశయం నుండి ఎగ్స్ సేకరించి వాటిని భద్రపరిచారు. దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. రెండేళ్ల పాటు దీని కోసం కష్టపడ్డాను. మానసికంగా సంసిద్ధం అయ్యానని మెహ్రీన్ అన్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పాలా వద్దా? అనే సంఘర్షణకు లోనయ్యాను. కానీ ఇతర మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్ పట్ల అవగాహన కలగాలని విషయం బహిర్గతం చేశానని మెహ్రీన్ చెప్పుకొచ్చింది.

    ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడిన మెహ్రీన్ పై మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చారని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా మెహ్రీన్ స్పందించారు. తనపై తప్పుడు కథనాలు రాస్తున్న మీడియా సంస్థలను హెచ్చరించారు. అదే సమయంలో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటో తెలియజేశారు.

    ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడానికి తల్లి కావాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని కనడానికి అన్ని విధాలా సిద్ధం అయ్యాక ఫ్రీజింగ్ చేసిన ఎగ్స్ వాడుకుని తల్లిదండ్రులు కావచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు నేను సోషల్ మీడియా ద్వారా నా వ్యక్తిగత విషయాన్ని బయటపెట్టాను. కొన్ని మీడియా సంస్థలు బాధ్యత లేకుండా తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాళ్లపై నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీ స్వార్థం కోసం నిరాధార కథనాలు ప్రచారం చేయకండని… మెహ్రీన్ ఘాటైన కామెంట్స్ చేసింది.

    మెహ్రీన్ ఎక్స్ లో పోస్ట్ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. మరోవైపు మెహ్రీన్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. కృష్ణగాడు వీర ప్రేమగాథ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన మెహ్రీన్ మహానుభావుడు, ఎఫ్ 2 వంటి హిట్ చిత్రాల్లో నటించింది. వరుస ప్లాప్స్ తో మెహ్రీన్ కెరీర్ నెమ్మదించింది. గత ఏడాది స్పార్క్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రస్తుతం కన్నడలో ఓ చిత్రం చేస్తుంది. తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు..