https://oktelugu.com/

Donald Trump: అమెరికాలో చైనా సైన్యం.. ట్రంప్‌ ప్రచారంతో అగ్రరాజ్యంలో రచ్చ

కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనా నుంచి అమెరికాకు వలసలు విపరీతంగా పెరిగాయి. దక్షిణ ఆమెరికాకు విమానాల్లో చేరుకుని అక్కడి నుంచి ప్రమాదరకరమైన మార్గాల్లో కాలినడకన ఉత్తర అమెరికాలో ప్రవేశిస్తున్నట్లు సమాచారం.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 15, 2024 / 09:25 AM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాను పదవిలో ఉన్నంత కాలం చైనా తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేస్తున్న ట్రంప్‌ మరోమారు చైనా వ్యతిరేక గళం ఎత్తుకున్నారు. చైనా నుంచి అమెరికాలోకి వలసలు భారీగా పెరిగాయని, వాటితో భవిష్యత్తులో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. మిలిటరీ వయసులో ఉన్న బృందమంతా ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని ఆరోపించారు. చివరకు అగ్రరాజ్యంపేనే దాడి చేస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇవి అమెరికాలో రచ్చకు కారణమయ్యాయి.

    ఎన్నికల ప్రచారంలో..
    అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్నాయి. దీంతో అధ్యక్షుడు బైడెన్‌తోపాటు, మాజీ అధ్యక్షుడు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన ప్రచారంలో మాట్లాడుతూ ‘‘చైనా నుంచి భారీగా పౌరులు వస్తున్నారు. వారిదంతా సైన్యం వయసే. అందుబాటులో పురుషులే అధికం. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు యత్నిస్తున్నారు. వారి ప్రయత్నంలో కూడా ఇది భాగమే అని తెలుస్తోంది.

    కోవిడ్‌ తర్వాత..
    కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనా నుంచి అమెరికాకు వలసలు విపరీతంగా పెరిగాయి. దక్షిణ ఆమెరికాకు విమానాల్లో చేరుకుని అక్కడి నుంచి ప్రమాదరకరమైన మార్గాల్లో కాలినడకన ఉత్తర అమెరికాలో ప్రవేశిస్తున్నట్లు సమాచారం. 2023లో అమెరికా, మెక్సికో సరిహద్దులో 37 వేల మంది చైనీయులను అరెస్ట్‌ చేసినట్లు తెలిసింది. 2022తో పోలిస్తే వలసల సంఖ్య 10 రెట్లు పెరిగింది.

    అమెరికాలోకష్టమే..
    అమెరికాలో చైనీయులు అక్రమ ప్రవేశాలు గణనీయగా పెరిగినట్లు ట్రంప్‌తోపాటు రిపబ్లిక్‌ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో భౌగోళికంగా, రాజకీయంగా ముప్పు ఉంటుందని భావిస్తున్నారు. అయితే కోవిడ్‌ సమయలో డ్రాగన్‌ కఠిన ఆంక్షలతో ఆర్థిక నష్టం, పేదరికం నుంచి తప్పించుకునేందుకు చైనీయులు ప్రయత్నించారు.

    విద్వేషం పెంచేలా..
    అమెరికాలో తమ పౌరులపై విద్వేశపూరిత ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఎటువంటి ఘటనలు చూశామని, ఆసియా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ట్రంప్‌ ప్రసంగాలు చైనాతోపాటు ఇతర ఆసియా దేశాల పౌరులపై విద్వేషాన్ని పెంచుతాయని చైనీయుల్లో దేషం పెంచుతాయని చైనీయుల ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడే సింథియా చోయ్‌ తెలిపాడు. అనేకమంది ఆసియన్‌ అమెరికన్లలో భయం నెలకొందని, ప్రజారవాణా వ్యవస్థ ను ఉపయోగించుకునేందుకు వెనుకాడుతారన్న నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏషియన్‌ పసిఫిక్‌ అమెరికన్స్‌ డైరెక్టర్‌ గ్ర్‌ ఓట్టాన్‌ తెలిపారు.