https://oktelugu.com/

CPI Narayana: జుంబా డాన్స్ చేసి అదరగొట్టిన సీపిఐ నారాయణ..! వీడియో వైరల్

CPI Narayana: రాజకీయ నాయకులు ఎప్పుడూ బిజీగా గడుపుతుంటారు. కుటుంబ సభ్యులతో కూడా క్షణం గడపలేని పరిస్థితి వారిది. రాజకీయాలు, ప్రజాసమస్యలు, పోరాటాలు అంటూ నిత్యం బిజీగా ఉండే.. నాయకులు ఖాళీ దొరికితే కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. తాజాగా సిపిఐ నాయకుడు నారాయణ ఖాళీగా దొరికిన సమయంలో జుంబా డాన్స్ చేసి అదరహో అనిపించారు. ఇప్పుడు రాజకీయాలు ప్రజా సమస్యలతో తీరిక లేకుండా గడిపే సిపిఐ జాతి కార్యదర్శి నారాయణ.. డాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి […]

Written By:
  • BS
  • , Updated On : March 26, 2023 / 01:06 PM IST
    Follow us on

    CPI Narayana

    CPI Narayana: రాజకీయ నాయకులు ఎప్పుడూ బిజీగా గడుపుతుంటారు. కుటుంబ సభ్యులతో కూడా క్షణం గడపలేని పరిస్థితి వారిది. రాజకీయాలు, ప్రజాసమస్యలు, పోరాటాలు అంటూ నిత్యం బిజీగా ఉండే.. నాయకులు ఖాళీ దొరికితే కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. తాజాగా సిపిఐ నాయకుడు నారాయణ ఖాళీగా దొరికిన సమయంలో జుంబా డాన్స్ చేసి అదరహో అనిపించారు. ఇప్పుడు రాజకీయాలు ప్రజా సమస్యలతో తీరిక లేకుండా గడిపే సిపిఐ జాతి కార్యదర్శి నారాయణ.. డాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. విజయవాడ అమరావతి యోగ అండ్ ఏరోబిక్ అసోసియేషన్ హాల్లో యోగా చేసిన నారాయణ.. జంబా ప్రాక్టీస్ చేస్తున్న గ్రూప్ సభ్యులతో కలిసి స్టెప్పులేసి అదరగొట్టారు. డాన్స్ చేయడంలోనూ తన తక్కువేమీ కాదనేలా ఆయన అలరించారు. చక్కని చుక్క అంటూ ఒక పాటకు సభ్యులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందర్నీ అలరించారు. రెండు నిమిషాల పాటు నారాయణ చేసిన డాన్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

    CPI Narayana

    భిన్నమైన వ్యవహారశైలి..

    సిపిఐ నారాయణది ముందు నుంచి భిన్నమైన వ్యవహారశైలి. మిగిలిన రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఆయన ఎవరి పైన విమర్శలు చేసిన, ఎవరి పైన పొగడ్తలు వర్షం కురిపించిన ఆయన శైలి ప్రత్యేకంగా ఉంటుంది. నరసాపురంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానించాల్సిందంటూ అప్పట్లో నారాయణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని సభ వేదిక తీసుకురావడం కరెక్ట్ కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన నాగబాబు.. సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి, కేవలం ఎండు గడ్డి, చెత్తాచెదారం తింటున్నాడంటూ విమర్శలు గుప్పించాడు. ఇలా అనేక విషయాలపై నారాయణ మాట్లాడిన మాటలు వివాదాస్పదం కావడం, అవి రాజకీయంగా దుమారాన్ని రేకెత్తించడం అనేక సందర్భాల్లో చోటుచేసుకుంది. తాజాగా అటువంటి రాజకీయ దుమారాలకు తావు లేకుండా చేసిన డ్యాన్స్ తో ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నారాయణ మరోసారి మారారు.