
Naga Chaitanya New House: నాగ చైతన్య ఇటీవల నూతన గృహప్రవేశం చేశారు. హైదరాబాద్ లో ఒక లగ్జరీ ఏరియాలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇంటి ధర తెలిసిన జనాలు నోరెళ్ళ బెడుతున్నారు. కాగా నాగ చైతన్య, సమంత నటుడు మురళీ మోహన్ కి చెందిన అపార్ట్మెంట్ లో ఉండేవారు. మురళీ మోహన్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అపార్ట్మెంట్ పైన మూడు పెంట్ హౌస్లులు నిర్మించారు. వాటిలో ఒకటి నాగ చైతన్యకు అమ్మారు. మొదట మురళీ మోహన్ ఆ ఇల్లు అమ్మను అన్నారట. నాగార్జున ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే కానీ ఇవ్వలేదట.
ఆ ఇంట్లో ఉన్నప్పుడు సమంత భారీగా ఇండిపెండెంట్ హౌస్ నిర్మించుకోవాలని ప్లాన్ చేశారు. స్థలం కొని తమ అభిరుచికి తగ్గట్లు డిజైన్ చేయించి నిర్మాణం చేపట్టారు. ఈ ఇల్లు పూర్తి కావస్తుండగా మురళీ మోహన్ అపార్ట్మెంట్ లో ఉన్న పెంట్ హౌస్ అమ్మేశారు.అనూహ్యంగా కొత్త ఇంట్లో అడుగు పెట్టకుండానే విడిపోవడం జరిగింది. దాంతో నాగ చైతన్య-సమంత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. నాగ చైతన్యతో కలిసున్న పాత ఇంటికి సమంత తిరిగి వెళ్లారు. ఆ పెంట్ హౌస్ ని అధిక ధర చెల్లించి దక్కించుకున్నారు. ప్రస్తుతం సమంత అక్కడే ఉంటున్నారు.
ఇక కొత్త ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో నాగ చైతన్య అందులోకి వెళ్లారు. ఉగాది సందర్భంగా చైతు నూతన గృహ ప్రవేశం చేశారట. అయితే ఈ ఇంటి ధర ఎంత అని వాకబు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిమ్, లైబ్రరీ, థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటి సకల హంగులతో పాటు విశాలమైన గార్డెన్ కలిగిన ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ. 15 కోట్లు అట. చెప్పాలంటే సామాన్యులు ఆ డబ్బుతో వంద ఇళ్ళు కట్టుకోవచ్చు. ఇండియాలో పేదవారి ఇంటి నిర్మాణ ఖర్చు రూ. 15 లక్షల లోపే. అయితే టాలీవుడ్ హీరోల్లో చిరంజీవి ఇల్లు అత్యంత ఖరీదైన నివాసంగా ఉంది.

ఇక చైతు నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కస్టడీ చిత్రంలో ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు. అలాగే నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. దూత టైటిల్ తో ఆయన చేసిన వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. నాగ చైతన్య గత చిత్రం థాంక్యూ నిరాశపరిచింది.