https://oktelugu.com/

పవన్ కు కరోనా: నాగబాబు vs బాబు గోగినేని రచ్చ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఫొటో బయటకు వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానికి పవన్ ఫ్యాన్స్ ‘వివేకానంద, చేగువేరా’లు వచ్చి పవన్ ను పరామర్శించినట్టు ఓ మార్ఫింగ్ ఫొటో తీర్చిదిద్ది వైరల్ చేశారు. దానిపై ఘాటు కౌంటర్లతో విరుచుకుపడ్డాడు హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని.. గాడ్సే, మండేలా, గాంధీని కూడా పరామిర్శించలేకపోయారా? ఈయన ఏమైనా దేవుడనుకుంటాడా? అవతరా పురుషుడా అంటూ ఘాటు కౌంటర్లు ఇచ్చాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2021 / 07:00 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఫొటో బయటకు వచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానికి పవన్ ఫ్యాన్స్ ‘వివేకానంద, చేగువేరా’లు వచ్చి పవన్ ను పరామర్శించినట్టు ఓ మార్ఫింగ్ ఫొటో తీర్చిదిద్ది వైరల్ చేశారు.

    దానిపై ఘాటు కౌంటర్లతో విరుచుకుపడ్డాడు హేతువాది, బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని.. గాడ్సే, మండేలా, గాంధీని కూడా పరామిర్శించలేకపోయారా? ఈయన ఏమైనా దేవుడనుకుంటాడా? అవతరా పురుషుడా అంటూ ఘాటు కౌంటర్లు ఇచ్చాడు.

    దీనిపై సీరియస్ అయిన పవన్ ఫ్యాన్స్ నాగబాబుకు ఉప్పందించారు. దీంతో నాగబాబు కాస్త ఘాటుగానే బాబు గోగినేనిపై సెటైరికల్ గా విరుచుకుపడ్డారు. ‘నాకు ఇలాంటివి ఫార్వర్డ్ చేయకండయ్యా.. నాకు కేవలం పెంపుడు కుక్కలు అంటేనే ఇష్టం.. బాబు గోగినేని మీద ఇంట్రస్ట్ లేదు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. దీన్ని బట్టి బాబు గోగినేనిని ‘కుక్క’ అని పరోక్షంగా ప్రస్తావించారు.

    ఇక నాగబాబు స్పందనకు అసలే ఫైర్ బ్రాండ్ అయిన బాబు గోగినేని ఊరుకుంటారా? మళ్లీ కౌంటర్ ఇచ్చిపడేశాడు. ‘గాంధీ గారి హంతకుడిని దేశ భక్తుడు అన్న దుష్టుడు తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్నాడు. కుక్కలు కాక మనుషులు తిరుగుతారా? నీ చుట్టూ కొన్నింటిని ఇంటర్నెట్ లో వదిలినట్టువు.. కట్టేసుకో అని బాబు గోగినేని ఘాటు కౌంటర్ ఇచ్చారు.

    ఇక ఈ ట్వీట్ తో మళ్లీ పవన్ ఫ్యాన్స్ బాబు గోగినేనిపై పడ్డారు. ట్యాగ్ చేస్తూ.. బాబు ఫొటోలు పెట్టి ట్రోల్స్ చేస్తూ మీమ్స్ చేస్తూ.. ఆయనకు బుతూల మెసేజ్ లు పెడుతూ హింసించారు. దీంతో మరోసారి బాబు గోగినేని తాజాగా ట్వీట్ చేశాడు.. ‘నువ్వు కానీ నీ పెంపుడు కుక్కలు కానీ.. నన్ను ట్యాగ్ చేసినా.. నా ఫొటో పెట్టి నా పై బూతులు వాడినా.. నా కంట పడిన ప్రతీ పోస్టుకు ప్రతీ యూట్యూబ్ వీడియోకి.. నీ గౌరవర్థం మర్యాదగా నేనొక పోస్టు పెడుతాను’ అని బాబు గోగినేని రెచ్చిపోయారు.

    ఇలా వీరి ట్వీట్ సంవాదం కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి సమరం సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.