Coconut Shell: మన దేశంలో కొబ్బరికాయల వాడకం చాలా ఎక్కువ. వారంలో ఒక్కసారైనా ప్రతీ ఇంట్లో కోకోనట్ పగులుతుంది. పూజకో, వంటకో దేనికోదానికి వాడుతారు. అలా పగలగొట్టిన చిప్పలోని కుడకను వాడుకుని చిప్ప పడేస్తాం. అందరూ చేసే పని కూడా ఇదే. నగరాల్లో ఉంటున్న కొందరు.. ఇప్పుడు కొబ్బరి పీచు, చిప్పలను వంటచెరుకుగా వాడుకుంటున్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులు, గ్యాస్ ధరల నేపథ్యంలో వేడినీళ్లు కాచుకునేందుకు కొబ్బరి చిప్పలను, కొబ్బరి బోండాం ముక్కలను వినియోగిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తారంటే.. కొబ్బరి చిప్పలతో ఏమీ పని ఉండదని, ఎందరూ పనికిరావని భావిస్తారు. కానీ, ఆ పనికిరాని చిప్పలే కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఆన్‌లైన్ ఈ–కామర్స్ సైట్లు ప్రస్తుతం కొబ్బరి కాయ ధర రూ.10 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నాయి. కొబ్బరి చిప్పలను మాత్రం రూ..1000కి పైనే ధరకు అమ్ముతున్నాయి.
అ ఈ కామర్స్‌లో 21.30 డాలర్లు..
తాజాగా glocing.com వెబ్‌సైట్ రెండు కొబ్బరి చిప్పల ధరను 21.30 డారల్లుగా చెప్పింది. మన కరెన్సీలో రూ.1,600 అన్నమాట. ఐతే… ఈ చిప్పల కోసం ఆర్డర్ ఇస్తే… వాటిని డోర్ డెలివరీ చెయ్యడానికి షిప్పింగ్ ఛార్జీలు 20 డాలర్లుగా పేర్కొంది. మన రూపాయిల్లో డెలివరీ ఛార్జి రూ.1500. మొత్తం కలిపి రూ.3,100కు పైనే. మనం ఎందుకూ పనికిరావు అని పారేస్తున్న కొబ్బరిచిప్పలకు ఆన్‌లైన్‌లో విపరీతమైన డిమాండ్ ఉందనుకోవాలా? లేక… కావాలనే ఈ–కామర్స్ సైట్లు ధరలను భారీగా పెంచుతున్నాయి అనుకోవాలా? చిప్పల ధరకి తోడు డెలివరీ ఛార్జీలు కూడా దాదాపు అంతే ఉండటం నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
అమెజాన్‌లోనూ అమ్మకం..
ప్రముఖ ఈ–కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో కూడా కొబ్బరి చిప్పల ధరలు రూ.150 నుంచి రూ.300 దాకా ఉంటున్నాయి. షైనింగ్ చేసిన చిప్పలు అంటూ ఈ కంపెనీ వీటిని అమ్ముతోంది. రైతులు పైపైన పాలిష్ చేసిన 6 చిప్పలను రూ.999కి అమ్ముతోంది. ఒక్కో చిప్పలో 200 ఎం.ఎల్ ఆహారం పడుతుందనీ.. ఈ చిప్పను గిన్నెలా వాడుకోవచ్చని చెబుతోంది.
ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
వ్యాపార సూత్రం:ఈ–కామర్స్ సైట్లలో కొబ్బరి చిప్పల ధరలు ఇంతలా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నా… ఎందుకు ఇంత రేటు అని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. డిమాండ్–సప్లయ్ సూత్రం ప్రకారం వాటిని ఈ ధరలకు అమ్ముతున్నట్లు ఈ కంపెనీలు చెప్పుకునే ఛాన్స్ ఉంది. డిమాండ్ ఉంది కాబట్టి… వాటికి ఆ ధర పలుకుతోంది అని తమ చర్యను సమర్థించుకోవచ్చు. ప్రజలు మాత్రం తాము పారేసే కొబ్బరి చిప్పలకు ఇంత డిమాండ్ ఉందా… అనవసరంగా వేల రూపాయల విలువైన వాటిని పారేసుకుంటున్నామా అని ఆలోచించాల్సి వస్తోంది.