
AP Liquor Policy: ప్రతిపక్షంలో ఉండగా మద్యపాన నిషేధం చేస్తామంటూ హామీలు ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి హామీని మర్చిపోయారు. దశలవారీగా మద్యపాన నిషేధం అంశాన్ని మర్చిపోయిన ఆయన.. దశలు వారీగా మద్యపానాన్ని మరింత తాగించే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సింహ భాగం మద్యపానం నుంచే వస్తుండడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజల చేత మద్యం తాగి ఇట్టే స్పష్టంగా అర్థం అవుతుంది.
మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమేనని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్.. అధికారం చేపట్టాక ఇప్పుడు అవే రక్త మాంసాలను తాకట్టు పెట్టి మరి అప్పుడు చేస్తున్నారు. మద్యపానంతో లక్షల జీవితాలు నాశనమవుతున్నాయి అన్న ఆ మనిషి ప్రజల్లోని కొందరి తాగుడు బలహీనతను అడ్డం పెట్టుకొని ఆదాయాన్ని పిండుకుంటున్నారు. ఆ రాబడిని హామీగా చూపించి వేల కోట్ల రుణాలు తీస్తున్నారు. అదే డబ్బుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ చట్టాలనే సవరించుకున్నారు. ప్రజల ప్రాణాలు ఆరోగ్యంతో చలగాటమాడుతూ వారి ఇల్లు గుల్ల చేస్తూ ఆ సొత్తుతోనే గల్లా పెట్టి గలగలలాడిస్తున్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని, మధ్యాహ్న నిషేధిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక మదం తిప్పేశారు జగన్మోహన్ రెడ్డి. మద్యం అమ్మకాల ఆదాయాన్ని ఏటేటా భారీగా పెంచుకుంటున్నారు. తనను పాదయాత్రలో కలిసి గోడు వెళ్ళబోసుకున్న కళ్ళ సుబ్బమ్మ లాంటి వారికి ఇచ్చిన భరోసా కు నీళ్లు వదిలేసారు. జగన్ భాషలోనే దీని ప్రశ్నించాలంటే ఇది ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం కాకపోతే మరేంటి.
నాలుగేళ్లలో భారీగా పెరిగిన మద్యం ఆదాయం..
మద్యం ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని ప్రకటించిన జగన్.. అందుకు విరుద్ధంగా మద్యంపై ఆదాయాన్ని ఏటేటా పెంచుతూ వస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోని ఐదేళ్లలో రూ.75,285.97 కోట్ల విలువైన మద్యం అమ్మారు. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.94,240 కోట్లు విలువైన మద్యాన్ని విక్రయించారు. ఇది ఆదాయం తగ్గించడమా పెంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సి ఉంటుంది.
తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన ఘనత సీఎం జగన్ దే..
రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీఎస్బిసిఎల్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్ల అప్పు చేసింది. ఏపీఎస్బీసీఎల్ బాండ్లు వేలం వేసి రూ.10,005 కోట్ల రుణం తీసుకొచ్చింది. ఈ అప్పులు తీర్చాలంటే ఏపీఎస్పీసీఎల్ వ్యాపారాన్ని విస్తరించాలి. అంటే మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలి. ప్రజలతో మరింత తాగించి తద్వారా ఆదాయం రాబట్టుకొని అప్పుడు తీరుస్తామనేదే ప్రభుత్వ విధానం అని స్పష్టమవుతున్నట్లే కదా. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమో కానీ దాని వల్ల ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతున్నారు. అందుకే రేపటి మన ప్రజా ప్రభుత్వం మధ్యాన్ని నిషేధిస్తుంది. అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. తాగడానికి డబ్బులు లేకపోతే కొందరు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టు మరి కొంటారు.. అలాంటి తాగుబోతుల్ని తాకట్టు పెట్టేసి వారిపై అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది.
దోపిడీని మించి.. ధరలు పెంచి..
రూ.100 విలువ చేసే మద్యం అమ్మితే అన్ని ఖర్చులు పోను ప్రభుత్వానికి రూ. 85 రూపాయలు మిగులుతుంది. రూ.100 విలువ చేసే మద్యం తయారీదారుల నుంచి కొని దుకాణాల్లో అమ్మి నిర్వహణ ఏపీఎస్పీబిసీఎల్ కమిషన్ అన్నీ కలిపిన ఖర్చయ్యేది రూ.15 మాత్రమే. స్టేట్ ఎక్సైజ్ పన్ను, వ్యాట్, ఇతరాల రూపంలో ప్రభుత్వానికి మిగిలేది రూ.85 రూపాయలు.
ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా..
‘చంద్రబాబు ప్రభుత్వం మధ్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తోంది. మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం. మద్యపానంతో రాష్ట్రంలో లక్షల జీవితాలు నాశనం అవుతున్నాయి. బతుకులను భోగి పాలు చేసి మహిళల కంట నీరు పెట్టించే ఆదాయంతో ఎవరికి మేలు జరగదు కదా సమాజానికి నష్టం. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమో కానీ ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతున్నారు’ అని ప్రతిపక్షంలో ఉండగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాల సంకల్ప యాత్ర పాదయాత్ర సందర్భంగా అనేకమార్లు చేసిన వ్యాఖ్యలు ఇది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాటల్లో మార్పులు వచ్చాయి. ‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయి. అందుకే మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మధ్యాన్ని నిషేధిస్తాం’ అని ఎన్నికల ప్రణాళిక సందర్భంగా వైసీపీ హామీని ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ‘ మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేం. అందుకే దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తాం. ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేసి ఓట్లు అడుగుతాం’ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. 2021 నవంబర్లో వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని ప్రకారం మద్యం అమ్మకాల ద్వారా లభించే ఆదాయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాలను కాపాడేలా సంక్షేమ పథకాలు వినియోగిస్తాం. చేయూత ఆసరా అమ్మవారి పథకాల అమలు బాధ్యత ఇకపై ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చూస్తుంది.. అని పేర్కొనడం గమనార్హం.
ఏటేటా భారీగా పెరుగుతున్న విక్రయాలు విలువ..
వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2020-21 ఆర్థిక సంవత్సరం మినహా యాట మద్యం విక్రయాలు విలువ భారీగా పెరుగుతూనే వచ్చింది. 2020-21తో పోలిస్తే 2021-22 లో విక్రయాలు విలువ 23.94% పెరిగింది. రూ.4,834 కోట్లు విలువైన మద్యం అదనంగా అమ్మారు. 2021-22 తో పోలిస్తే 2022-23 లో మద్యం విక్రయాల విలువ 12.29 శాతం పెరిగింది. రూ.3,077 కోట్ల విలువైన మద్యం అదనంగా విక్రయించారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే మద్యం విక్రయాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం (2019 జూన్ – 2024 మే) పూర్తి అయ్యేసరికి ఐదేళ్లలో మద్యం విక్రయాలు విలువ రూ.1.20 లక్షలు కోట్లు దాటే అవకాశం కనిపిస్తుంది. ఈ స్థాయిలో మద్యం ఆదాయం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. దీని వినియోగం తగ్గించడం అంటారా అన్నది ప్రభుత్వమే చెప్పాల్సి ఉందన్నది నిపుణుల మాట.
రాబడి లక్ష్యంగా అమ్మకాలు..
ఏదైనా ఒక వస్తువు మీద పది, ఇరవై శాతం లాభం వేసుకొని అమ్మితే దాన్ని వ్యాపారం అంటారు. కొనధరపై అనేక రెట్లు లాభం వేసుకొని విక్రయిస్తే దాన్ని ఏమనాలి. ఎవరైనా వ్యాపారి అలా చేస్తుంటే అత్యాశ/దురాశ అనుకోవచ్చు. ప్రభుత్వమే అలా చేస్తే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే దాన్ని వివరించేందుకు దోపిడీ అనే పదం సరిపోదు ఏమో. మద్యం ధరలు సాక్ కొట్టేలా ఉంటే వినియోగం తగ్గుతుందని మొదట ధరలు భారీగా పెంచారు. తర్వాత తగ్గించారు. ధరలు పెంచినప్పుడు అమ్ముడైన మద్యం పరిమాణం తగ్గిన ప్రభుత్వానికి ఆదాయం తగ్గలేదు. ఇప్పుడు ధరలు తగ్గించిన తర్వాత అమ్ముడు అవుతున్న మధ్య పరిమాణంతో పాటు ఆదాయము పెరిగింది. అంటే ధరలు పెంచిన తగ్గించినా ప్రభుత్వం ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉంది.

మధ్య ఆదాయం హామీగా చూపించి అప్పులు..
భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. ఏపీఎస్బీసీఎల్ బాండ్లు వేలం వేసి మరి అప్పులు తెచ్చారు. ఈ రుణాలు తీర్చాలంటే వ్యాపారం పెంచుకోవాల్సిందే. మద్యంపై విధించే వివిధ పనుల్లో రాష్ట్ర ఎక్సైజ్ పన్ను ప్రధానమైనది. దీని ద్వారానే గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.16,167 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పన్ను ద్వారానే రూ.18000 కోట్లు వస్తుందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాలలో పేర్కొంది. రూ.18 వేల కోట్లు రావాలంటే దాదాపు రూ.33 వేల కోట్లు మద్యం అమ్మాలి. ఇది మరింత తాగించు మరింత ఆదాయం పిండుకో అనే విధానం కాకపోతే మరేంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.