
Upasana: మెగా ఫ్యామిలీ పెద్ద దిక్కు అంజనా దేవి వంట గొప్పగా చేస్తారు. కొడుకు చిరంజీవి ఆమె చేతి వంటను ఎంతో ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు అమ్మకు నచ్చిన వంటకాలు ఆయన స్వయం చేసి వడ్డిస్తారు. ఇది చిరంజీవికి ఇష్టమైన వ్యాపకం. కాగా చరణ్ వైఫ్ ఉపాసన కోసం అంజనా దేవి ప్రత్యేక వంటకం చేశారు. ఆ విషయాన్ని చెప్పుకొని ఉపాసన మురిసిపోతున్నారు. గర్భవతిగా ఉన్న మహిళలకు ఇష్టమైన పదార్ధాలు చేసి పెడుతుంటారు. వారి ఇష్టాలు తీర్చడం అనేది హిందూ సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంది. కాగా ఆదివారం మనవడు చరణ్ భార్య ఉపాసనకు ఇష్టమైన పులావు ని అంజనాదేవి దేవి స్వయంగా తయారు చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రేమతో కూడిన పులావు ఇంత కంటే ఏం కావాలంటూ ఉపాసన కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం ఉపాసన 7 నెలల గర్భవతి. ఇటీవలే విదేశాలు చుట్టొచ్చారు. దుబాయ్, మాల్దీవ్స్ లో విహారాలు చేశారు. ఉపాసన సీమంతం దుబాయ్ లో జరగడం విశేషం. కడుపులో బిడ్డతో పాటు ప్రపంచాన్ని చుట్టడం గొప్ప అనుభూతి అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.
2022 డిసెంబర్ నెలలో చిరంజీవి కోడలు ఉపాసన తలైన విషయాన్ని పంచుకున్నారు. పదేళ్ల నిరీక్షణ కావడంతో ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే కావాలనే గ్యాప్ తీసుకున్నట్లు ఉపాసన చెప్పడం విశేషం. పెళ్ళైన కొత్తలోనే పదేళ్ల వరకు పిల్లల్ని కనకూడని చరణ్, నేను ఒప్పందం చేసుకున్నామని ఆమె అన్నారు. పిల్లలను కనడం పెద్ద బాధ్యత. దానికి అన్ని విధాలుగా మనం సంసిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆర్థికంగా మేము నిలదొక్కుకున్నాము. పిల్లలు కోరిన జీవితం అందించగలమన్న నమ్మకం ఉందంటూ… ఉపాసన చెప్పుకొచ్చారు.

2012లో రామ్ చరణ్-ఉపాసన పేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఘనంగా పెళ్లి జరిగింది. ఈ పదేళ్లలో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ఉపాసన యంగ్ ఎంట్రప్రెన్యూర్ గా అరుదైన విజయాలు సాధించారు. కోటీశ్వరుల కుటుంబంలో పుట్టినప్పటికీ కష్టపడటం అలవరుచుకున్నట్లు ఉపాసన అన్నారు. తమ పిల్లలను అలానే పెంచనున్నట్లు ఉపాసన అన్నారు.
Sunday Pulao made with loads of love ❤️. What more can I ask for. 🤗🤗🤗 pic.twitter.com/EegIdtsU80
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2023