
Manchu Manoj: ఇటీవల కాలం లో సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన మంచు మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు. సుమారుగా నాలుగేళ్ల నుండి డేటింగ్ చేస్తున్న ఈ జంట ఈమధ్యనే పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.వీళ్లిద్దరికీ ఇది రెండవ పెళ్లి అనే విషయం తెలిసిందే, భూమా మౌనిక రెడ్డి గతం లో గణేష్ అనే వ్యక్తిని పెళ్ళాడి ఆ తర్వాత కొన్నాళ్ళకు విడిపోయింది.
ఈ జంట ఇద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, మనోజ్ ఆ పిల్లాడిని తన బిడ్డగా కూడా స్వీకరించాడు.ఇక మనోజ్ కి కూడా ఇది రెండవ పెళ్లిగా చెప్పుకోవచ్చు, 2017 వ సంవత్సరం లో ఈయన ప్రణతి రెడ్డి ని వివాహం చేసుకున్నాడు. అయితే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయం బేధాలు రావడం వల్ల 2019 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు. విడాకులకు కారణం ఏమిటి అనే విషయాన్నీ ఇన్ని రోజులు మనోజ్ చెప్పలేదు కానీ రీసెంట్ గా ఆయన పాల్గొన్న ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా ఈటీవీ లో ‘అలా మొదలైంది’ అనే టాక్ షో ఈమధ్యనే ప్రారంభం అయ్యింది. ప్రతీ మంగళవారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రసారం అయ్యే ఈ టాక్ షో కి సెలబ్రిటీ కపుల్స్ జంటగా వచ్చి, తమ లవ్ స్టోరీ గురించి పంచుకుంటూ ఉంటారు.అలా ఈ వారం మంచు మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డి ఈ టాక్ షో కి విచ్చేసారు. తమ ప్రేమ ఎలా మొదలైంది,జీవితం లో ఎన్ని సవాళ్ళను ఎదురుకున్నారు వంటి ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పుకొచ్చారు.అలాగే మొదటి భార్య ప్రణతి రెడ్డి తో విడాకుల గురించి కూడా ఓపెన్ అయ్యాడు మనోజ్.

ఆయన మాట్లాడుతూ ‘నాకు ప్రేమ జీవితం కావాలా?, లేదా తన అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు చేసుకోవాల్నా?, అనే సందిగ్ధం లో పడినప్పుడు ఎన్నో కష్టాలను, ఎంతో నరకం ని అనుభవించాను. ఆ సమయం లో నేను ప్రణతి రెడ్డి కి పంచిన ప్రేమ తిరిగి రాలేదు. చాలా సార్లు ఆమెకి ఇష్టం లేని పనులు చెయ్యాల్సి వచ్చేది. అందువల్ల అభిప్రాయం భేదాలు పరస్పరం వచ్చేవి, ఇలా జీవితాంతం గొడవపడే బదులు విడిపోయి ఎవరి దారి వారు చూసుకుంటే బెటర్ అనిపించింది. అందుకే విడాకులు తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్.