
Dasara 18 Days Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం ఇటీవలే విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, విడుదల తర్వాత ఆ అంచనాలను మొదటి ఆట నుండే అందుకోవడం లో సఫలం అయ్యింది.ఫలితంగా ఒక స్టార్ హీరో కి ఎలాంటి వసూళ్లు అయితే వస్తాయో, అలాంటి వసూళ్లు వచ్చాయి.
కొన్ని ప్రాంతాలలో అయితే కొంతమంది స్టార్ హీరోలకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే 18 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, 18 వ రోజు ఆదివారం కావడం తో చాలా ప్రాంతాలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. కొత్తగా విడుదలైన రెండు సినిమాలకంటే ‘దసరా’ కి ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఇది అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా 18 వ రోజు దాదాపుగా 40 లక్షల షేర్ ని వసూలు చేసిందని తెలుస్తుంది.
మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 18 రోజులకు గాను 63 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి, ఇప్పటికీ దిగ్విజయం గా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఓపెనింగ్స్ తగ్గ కలెక్షన్స్ వీకెండ్ నుండి పెద్దగా లేకపోయినా, సోలో సమ్మర్ కారణంగా లాంగ్ రన్ అదరగొట్టేసింది.ఇక తెలంగాణ ప్రాంతం లో అయితే ఈ సినిమా ఏకంగా 26 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. ఇది స్టార్ హీరో రేంజ్ వసూళ్లు అని చెప్పొచ్చు, అలాగే అమెరికా లో ఈ సినిమాకి రెండు మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసింది.

కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ సినిమా కనీసం 20 కోట్ల రూపాయిల షేర్ ని కూడా వసూలు చెయ్యకపోవడం విశేషం. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో యావరేజి తో ఫలితం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో వీకెండ్ కూడా డీసెంట్ వసూళ్లు వచ్చే ఆ అవకాశం ఉండడం తో ఫుల్ రన్ లో ఈ సినిమా 64 కోట్ల రూపాయిలు రాబట్టే ఛాన్స్ ఉంది.