Upaasana Seemantham : ఉపాసన ‘సీమంతం’ వేడుకలో చిరంజీవి లేకపోవడానికి కారణం అదేనా..!

Upaasana Seemantham : మెగా ఫ్యామిలీ కుటుంబం ఇప్పుడు మంచి జోష్ మీద ఉంది.అటు వృత్తి పరంగా ఇటు వ్యక్తిగతం గా కుటుంబం లో ఉన్న అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.వృత్తి పరంగా రామ్ చరణ్ #RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించాడు.ఇక మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తో మంచి జోష్ మీదున్నాడు.పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’,’వకీల్ సాబ్’ వంటి వరుస హిట్ సినిమాలతో ఆయన […]

Written By: NARESH, Updated On : February 17, 2023 8:42 pm
Follow us on

Upaasana Seemantham : మెగా ఫ్యామిలీ కుటుంబం ఇప్పుడు మంచి జోష్ మీద ఉంది.అటు వృత్తి పరంగా ఇటు వ్యక్తిగతం గా కుటుంబం లో ఉన్న అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.వృత్తి పరంగా రామ్ చరణ్ #RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది పాన్ వరల్డ్ స్టార్ గా అవతరించాడు.ఇక మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తో మంచి జోష్ మీదున్నాడు.పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’,’వకీల్ సాబ్’ వంటి వరుస హిట్ సినిమాలతో ఆయన కూడా సక్సెస్ స్ట్రీక్ లోనే ఉన్నాడు.

ఇలా కుటుంబం మొత్తం వృత్తి పరంగా ఎంత సంతోషం గా అయితే ఉన్నారో, వ్యక్తిగతంగా అంతకు మించి సంతోషం తో ఉన్నారు.కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అనే విషయమే.ఎప్పటి నుండో ఈ వార్త కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి చిరంజీవి కొంతకాలం క్రితమే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్నీ తెలియచేసాడు.

ఎప్పుడైతే చిరంజీవి ఈ విషయాన్నీ తెలియచేసాడో అప్పటి నుండి మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఉపాసన కి ‘సీమంతం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.మూడు నెలలు నిండిన తర్వాత ఏ ఆడబిడ్డకు అయినా సీమంతం చెయ్యడం అనేది మన హిందూ ధర్మ ఆచారం అనే సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు నిన్న సోషల్ మీడియా లో విడుదలై వైరల్ గా మారాయి.ఇందులో రామ్ చరణ్ మరియు ఉపాసన తో పాటు బంధుమిత్రులు కూడా ఉన్నారు కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.

చిరంజీవి ఎందుకు ఫోటోలలో లేడు..?, ఒకవేళ ఆయన ఉన్న ఫోటోలను అప్లోడ్ చెయ్యలేదా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.అంతే కాకుండా చిరంజీవి హైదరాబాద్ సిటీ లో లేడని, షూటింగ్ కోసం చెన్నై లో ఉన్నదంటూ వార్తలు కూడా వచ్చాయి.ఏదిఏమైనా చిరంజీవి ఈ సీమంతం ఫోటోలలో కనిపించకపోవడం పై సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.