
మెగా ఫ్యామిలీ అంతా ఒక ఎత్తు.. పవన్ కళ్యాన్ మరో ఎత్తు. ఆయన ఎవరితో కలవడు.. ఎవరినీ కలుపుకోడు. తన సినిమా ఫంక్షన్లకు కూడా మెగా హీరోలను పిలవడు. అంతా వన్ మ్యాన్ ఆర్మీ. అలాంటి పవన్ కోసం ఇప్పుడు అన్న చిరంజీవి, కొడుకు రాంచరణ్ కదిలివస్తున్నారు. ఇది పవన్ ఫ్యాన్స్ లో గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది.
పవన్ రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ రీఎంట్రీ ద్వారా వస్తున్న మూవీ ‘వకీల్ సాబ్’.ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవన్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్, మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ రీఎంట్రీ మూవీని దిగ్గజ నిర్మాత దిల్ రాజు తీశారు. ఆయన సహజంగానే దీనికి ఎక్కువ ప్రచారం కల్పించేందుకు రెడీ అవుతున్నారట.. ఈ క్రమంలోనే ప్రీరిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలని.. ఇందుకు రూ.కోటికిపైగా ఖర్చు చేయబోతున్నారని సమాచారం.
ఇప్పటికే రాంచరణ్ ను దిల్ రాజు ఒప్పించినట్టు సమాచారం. ఇక అన్నయ్య చిరంజీవిని కూడా పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కు స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ విషయంలో దిల్ రాజు కీలక పాత్ర పోషించి చిరంజీవి, రాంచరణ్ ను ఈ ఫంక్షన్ కు తీసుకువస్తే సినిమాకు బజ్ వస్తుందని ప్లాన్ చేసినట్లు సమాచారం.
దీంతో ఇప్పుడీ ఫంక్షన్ కు చిరు, రాంచరణ్ వస్తే పవన్ తో కనిపిస్తే ఫ్యాన్స్ కు గూస్ బాంబ్స్ రావడం ఖాయమంటున్నారు.