
అక్కినేని నాగార్జున అభిమానుల నుండి చాల నెలలుగా వినిపిస్తోన్న ఏకైక డిమాండ్.. “బంగార్రాజు” పరిస్థితి ఏమిటి అని ? ఎప్పుడో మొదలుకావాల్సిన ఈ సినిమా ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ లేకుండా సంవత్సరాల తరబడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యలో నాగ్ మాత్రం బిగ్ బాస్ దగ్గర నుండి యాడ్స్ వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా బాగానే బిజీగా ఉన్నాడు. కానీ, ఎందుకో “బంగార్రాజు”ను మాత్రం నాగ్ పట్టించుకున్నట్లు కనిపించడంలేదు.
అయితే నాగ్ తాజాగా నటించిన “వైల్డ్ డాగ్” సినిమా ఏప్రిల్ 2న విడుదల అవుతుంది కాబట్టి.. ఆ తరువాత “బంగార్రాజు” మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే, నాగ్ మాత్రం ఇంకా “బంగార్రాజు” పై ఇంట్రస్ట్ చూపించడం లేదట. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో కొత్త సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాడు. ఎలాగూ ఈ సినిమా మరో పది నెలలు సాగుతుందని టాక్. అలా అయితే “బంగార్రాజు” ఇప్పట్లో ఇక స్టార్ట్ అవ్వదు అని తేలిపోయినట్లే.
అసలు “బంగార్రాజు”ను నాగ్ వదిలేయడానికి ప్రధాన కారణం.. కథ సరిగ్గా రాలేదు అని తెలుస్తోంది. పైగా “బంగార్రాజు”లో నటించేందుకు నాగ చైతన్య కూడా నో చెప్పాడని.. అదే విధంగా అఖిల్ కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపడం లేదని.. దాంతో నాగ్ కూడా ఈ సినిమా కథ మార్చండి అంటూ ప్రస్తుతానికి ఈ సినిమాను పోస్ట్ ఫోన్ చేస్తూ వస్తున్నాడు అని సమాచారం. కథ ప్రకారం, నాగార్జునతో పాటు మరో హీరో ప్రెజెన్స్ కంపల్సరీ కాబట్టి.. ఇప్పుడు మరో యంగ్ హీరో కావాలి. మరి ఏ హీరో ఒప్పుకుంటాడు అనేది కూడా ఇక్కడ అర్ధం కావడం లేదు. మొత్తానికి “బంగార్రాజు” పరిస్థితి దారుణంగానే ఉంది.