Cheetahs: పులి అంటే క్రూరత్వానికి నిదర్శనం.. అలాంటి జంతువు ను డిస్కవరీ ఛానల్ లో చూస్తేనే భయపడతాం. పులి కనిపించిందని టీవీల్లో లేదా న్యూస్ పేపర్ లో చూస్తే అమ్మ బాబోయ్ అంటూ భయపడతాం. అలాంటిది పులి కంటే మరింత వేగంగా పరిగెత్తి, చూస్తుండగానే ప్రాణం తీసే చిరుత పులి గురించి ప్రస్తావన వస్తే మరింత బెదిరిపోతాం. కానీ అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చిరుత పులుల సమూహంతో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా? లేకుంటే జోక్ చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు కదూ.. అయితే ఈ కథనం చదివేయండి.. దాదాపు ఒక అడ్వెంచర్ సినిమా లాగా ఉంటుంది.
ఈ భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుల్లో చిరుత పులి కూడా ఒకటి. ఈ చిరుతపులుల సంచారం ఆఫ్రికా, దేశాలలో అధికంగా ఉంటుంది. ఒక చిరుత పులి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. చిరుతపులులు క్రూరత్వానికి ప్రతీకలు. ఇవి ఒక సమూహంగా కనిపిస్తాయి. కలిసి వేటాడుతాయి. ఇరాన్ దేశంలో చిరుతప్రులు ఎక్కువ ఉన్నప్పటికీ.. చాలామంది వీటిని ఆఫ్రికాలో చూసేందుకే ఇష్టపడుతుంటారు. అక్కడి జంగిల్ సఫారీ మక్కువ చూపిస్తుంటారు. పైగా చిరుతపులులు వెంటాడి వేటాడి చంపేస్తుంటాయి. వీటికి దూరంగా ఉండడమే శ్రేయస్కరమని చాలామంది అంటుంటారు. అయితే ఇలాంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతున్నది. అది చూసిన తర్వాత మైండ్ బ్లాంక్ అవడం కచ్చితంగా ఖాయం.
చిరుతపురులు మనుషులతో స్నేహంగా ఉంటాయి? ఈ విషయాన్ని మీరు నమ్ముతారా? ఒకవేళ నమ్మకుంటే ఈ కథనం కింద లింక్ లో ఒక వీడియో క్లిక్ చేయండి. కచ్చితంగా పై ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. “బాలు ట్రావెల్ టీడీ ” ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియో పోస్ట్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో జంగిల్ సఫారీ కోసం కొందరు పర్యాటకులు వాహనంలో వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లిన తర్వాత చిరుతల గుంపు వారికి ఎదురైంది. చిరుతలు ఏకంగా ఆ వాహనంపై ఎక్కేసాయి. ఆ వాహనంలో కూర్చున్న మనుషులకు ఎటువంటి అపాయం కలిగించకుండా వాహనంపై నిలుచున్నాయి. ఆ వాహనం పైకప్పు పై పడుకొని ప్రయాణం చేశాయి. ఆ తర్వాత వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లిపోయాయి. వాహనంలో ఎలాంటి రక్షణ లేకుండా ఉన్న మనుషులపై చిరుతలు దాడి చేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను కెన్యాలోని జాతీయ గేమ్ రిజర్వ్ అయిన మసాయి మారాలో చిత్రీకరించారు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ” చిరుతలతో కలిసి ప్రయాణమా? మీకు ఏ అవార్డు ఇవ్వాలి భయ్యా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Kenya
Courtsey #welcometoKenya #masaimara #cheetah #Safari #wildlife #tour pic.twitter.com/u51N9TO1uX
— Balu Travel Ltd (@balutraveltd) July 26, 2023