https://oktelugu.com/

Bigg Boss Sarayu: ఒక్కరోజు ఆ ఛాన్స్ వచ్చినా చాలు… పెళ్ళైన హీరో మీద మనసుపడ్డ బిగ్ బాస్ సరయు

సరయుకు వెండితెర ఆఫర్స్ కూడా వస్తున్నాయి. గత ఏడాది విడుదలైన 18 పేజెస్ మూవీలో సరయు ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. హీరో నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్ గా కీలక రోల్ చేసింది.

Written By:
  • Shiva
  • , Updated On : August 2, 2023 / 02:17 PM IST

    Bigg Boss Sarayu

    Follow us on

    Bigg Boss Sarayu: యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన సరయు బిగ్ బాస్ షోకి వెళ్లి మరింత పాపులర్ అయింది. సెవెన్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ లో సరయు బోల్డ్ కంటెంట్ తో అలరించేది. బూతులతో సినిమా రివ్యూలు చెప్పడం అనే కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసింది. అడల్ట్ కంటెంట్ తో ఆమె చేసిన వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 5లో ఛాన్స్ దక్కింది. సరయు యాటిట్యూడ్ హౌస్ కి బాగా సెట్ అవుతుందని జనాలు నమ్మారు. అక్కడ ఆమె సంచలనాలు చేయడం ఖాయం అనుకున్నారు.

    అయితే సరయు కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు. ఇటీవల సరయు బిగ్ బాస్ షోపై కీలక ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ షో అంత ఫేక్. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కొందరు డబ్బులు ఎదురిచ్చి వెళతారు. హౌస్లో వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళ జోలికి పోతే మనల్ని చెడ్డగా చూపిస్తారు. బయటకు పంపేస్తారని సరయు చేయడం సంచలనం రేపింది. బిగ్ బాస్ కొద్ది రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉండగా… సరయు కామెంట్స్ వైరల్ అయ్యాయి.

    ఇక పెళ్లి, ప్రేమ గురించి కూడా సరయు బోల్డ్ కామెంట్స్ చేయడం విశేషం. సరయుకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదట. అదంతా వేస్ట్ అంటుంది. అయితే తనకు రామ్ చరణ్ అంటే మహా ఇష్టం అట. ఆయనకు పెళ్లైన విషయం తెలిసి తెగ బాధపడిపోయిందట. ఆయనతో ఒక్కరోజు డేటింగ్ చేసినా చాలు. ఆ రోజు వస్తే వదులుకోను. నేను రెడీ అంటూ రామ్ చరణ్ పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది.

    సరయుకు వెండితెర ఆఫర్స్ కూడా వస్తున్నాయి. గత ఏడాది విడుదలైన 18 పేజెస్ మూవీలో సరయు ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. హీరో నిఖిల్ క్లోజ్ ఫ్రెండ్ గా కీలక రోల్ చేసింది. నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రంలో సరయు తన మార్క్ నటనతో మెప్పించింది. అలాగే మరి కొన్ని చిత్రాల్లో సరయు సందడి చేశారు.