Uttar Pradesh: యోగి అమ్ములపొదిలో ఆ రెండు ఆయుధాలు..!

ఉత్తరప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ సెలక్షన్‌ కమిషన్‌ బిల్లు 2023కి ఉత్తరప్రదేశ్‌ క్యాబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : August 2, 2023 2:32 pm

Uttar Pradesh

Follow us on

Uttar Pradesh: దేశంలో అతిపెద్ద రాష్ట్రం.. అభివృద్ధిలో మాత్రం చివరి వరసలో.. ఇదుకు ప్రధాన కారణం విద్యలో వెనుకబాటు. అవినీతి… రాష్ట్రంలో అశాంతి… అల్లర్లు. పర్యాటకంగా ఆకట్టుకోకపోవడం. ఈ రెండు వాస్తవాలను గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గ్రహించింది. ఈమేరకు యోగా సర్కార్‌ తాజాగా కేబినెట్‌ భేటీలో ఈమేరకు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఈ నిర్ణయాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ సెలక్షన్‌ కమిషన్‌ బిల్లు 2023కి ఉత్తరప్రదేశ్‌ క్యాబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. ఇతర ప్రభుత్వ విద్యాసంస్థల్లో నియామకాలు కాకుండా ప్రభుత్వృసహాయక విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం సెలక్షన్‌ కమిషన్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ సెలక్షన్‌ కమిషన్‌గా పని చేస్తుంది.

ఇక సెలక్షన్‌ కమిటీ ద్వారా నియామకాలు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఎంపిక కోసం ప్రత్యేక ఎంపిక బోర్డులు, కమిషన్లు ఉండేవి. ఇక నుంచి ఉత్తరప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ కమిషన్‌ మరియు ఉత్తరప్రదేశ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు కూడా రద్దు చేసే యోజనలో యోగి సార్కర్‌ ఉంది. కొత్త ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ సెలక్షన్‌ కమిషన్‌ కార్యాలయం ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు, ఈ కమిషన్‌లో 12 మంది సభ్యులు, ఒక చైర్మన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందని విద్యాశాఖ మంత్రి యోగేంద్ర ఉపాధ్యా తెలిపారు.

నీటి పర్యాటకం
వాటర్‌ టూరిజం, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ పాలసీ 2023కి కూడా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇది 10 ఏళ్లు చెల్లుబాటులో ఉంటుంది. అన్ని లోతట్టు భూ–ఆధారిత, వాయు–ఆధారిత మరియు నీటి మార్గాలు, ఆనకట్టలు, రిజర్వాయర్లు, సరస్సులు, నదులు, చెరువులు మరియు అన్ని సాహస కార్యకలాపాలకు వర్తిస్తుంది. వింధ్య, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాలలో 16,620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాల దిగువ ప్రాంతంలోని కొండలు, అలాగే అనేక అందమైన ప్రకృతి దృశ్యాలు, అటవీ ప్రాంతాలు, ప్రవహించే నదులు, అందమైన జలపాతాలు, ఆనకట్టలు రాష్ట్రంలోని వివిధ జలధారలు, భూభాగాలపై నిర్వహించబడతాయి. రిజర్వాయర్లు, సరస్సులు నీటి ఆధారిత పర్యాటకం, సాహస క్రీడలు, జల క్రీడలకు చాలా అవకాశాలను కలిగి ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రిమండలిలో చిర్చించి ఆమోదం తెలిపినట్లు యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్‌సింగ్‌ తెలిపారు.

ఈ రెండు నిర్ణయాల ద్వారా ఉత్తర ప్రదేశ్‌లో విద్యను బలోపేతం చేయడంతోపాటు పర్యాటకంగా ఆకర్షించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉపాధ్యాయుల నియామకం నుంచే విద్యాశాఖలో క్వాలిటీ పెంచేలా కమిషన్‌ ఏర్పాటు చేశారు. పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు యూపీ సర్కార్‌ పరోక్షంగా తెలిపింది.