Char Dham Yatra: జీవితంలో ఒక్కసారైనా కూడా చార్ ధామ్ వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. ఈ చార్ ధామ్ యాత్ర అయితే చాలా మంది కల. ఎలాగైనా కూడా వెళ్లాలని డబ్బులను దాచి పెడతారు. నిజం చెప్పాలంటే ఒక ఏడాది ముందుగానే డబ్బులు దాచి పెట్టి ఈ యాత్ర కోసం ప్లాన్ చేసుకుంటార. నేటి నుంచి ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్రకు ఇప్పటికే 20 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ యాత్రకు వెళ్లే వారి సంఖ్య కూడా ఇంకా పెరుగుతుంది. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ చార్ ధామ్ యాత్రకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న వెళ్తారు. మంచు కొండల మధ్య ప్రకృతి అందాలను చూడటానికి చాలా మంది ఇష్టపడతారు. చార్ ధామ్‌లో మొత్తం నాలుగు ధామ్‌లు ఉంటాయి. గంగోత్రి, యమునోత్రి, కేదర్‌నాథ్, బద్రీనాథ్ ఉంటాయి. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్ ధామ్ అంటారు. అయితే ఈ నాలుగు ఆలయాలు ఏడాది మొత్తం ఓపెన్ చేసి ఉండవు. కేవలం ఆరు నెలలు మాత్రమే ఓపెన్ చేసి ఉంటాయి. మే నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఓపెన్ ఉంటాయి. అయితే ఎప్పటి నుంచి ఈ యాత్రకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నా వారు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల యాత్ర చేసిన ప్రతిఫలం కూడా పొందలేరు. అయితే చార్ ధామ్ యాత్ర చేసేటప్పుడు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకోండి.
Also Read: ఇలాంటి ప్రవర్తన ఎవరైనా అనుమతిస్తారా? పెద్ది హీరోయిన్ జాన్వీ సీరియస్
ఆహార నియమాలు
ఈ యాత్ర చేసే వారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ ప్రదేశాల్లో అసలు మాంసాహారం లభ్యం కాదు. కానీ మీరు తీసుకెళ్లి తినడం వంటివి అసలు చేయకూడదు. అలాగే వీటితో పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. కేవలం వెజ్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మీరు యాత్ర చేసిన దానికి ఫలితం ఉంటుంది.
మంచి ప్రవర్తన
చార్ ధామ్ యాత్రకు వెళ్లేవారు మంచి ప్రవర్తనతో ఉండాలి. అక్కడ ఎవరితో కూడా గొడవ పడకూడదు. ఎప్పుడూ భగవంతుడిని ధ్యానిస్తూ.. యాత్ర చేయాలి. అప్పుడే మీకు మంచి ఫలితం లభిస్తుంది. లేకపోతే మీ యాత్రకు అసలు ఫలితం కూడా ఉండదు. కాబట్టి తప్పుడు ఆలోచనతో అయితే అసలు యాత్ర చేయవద్దు.
భక్తితో ఉండండి
చార్ ధామ్ యాత్రకు వెళ్లేవారు ఎక్కువగా భక్తితో కాకుండా ఫొటోలు, వీడియోలు కోసం వెళ్తుంటారు. ఇక్కడికి వెళ్లిన వారు సోషల్ మీడియా, ఫొటోలు, మాటలను పక్కన పెట్టి భక్తితో దర్శించుకోండి. భక్తితో దర్శించుకుంటే.. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని కొందరు నమ్ముతారు.
ఇంట్లో ఇలా ఉంటే వద్దు
ఇంట్లో ఎవరైనా మరణించి ఉంటే అసలు ఈ యాత్ర చేయవద్దు. రిలేటివ్స్ అయితే సూతక కాలం 12 నుంచి 13 రోజుల వరకు ఆలయాలకు వెళ్లకూడదు. అదే మీ కుటుంబ సభ్యులు అయితే ఏడాది వరకు వెళ్లకూడదు. ఇలాంటి సమయంలో వెళ్లినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.
Also Read: హిట్ 4లో ఆ క్రేజీ హీరో, నాని హిట్ 3లో పవర్ఫుల్ ఎంట్రీ!