Hyderabad: కంచే చేను మేస్తే దాన్ని ఏమనాలి? ఎవరు రక్షించాలి? సమాజాన్ని రక్షించాల్సిన పోలీసులే భక్షణకు దిగితే.. రక్షించాల్సిన వారే కామాంధులైతే ఎవరితో చెప్పుకోవాలి? కచ్చితంగా అది పోలీస్ శాఖ కు మాయని మచ్చగా నిలుస్తుంది. హైదరాబాదులోని కొత్తపేట చైతన్యపురిలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ పోలీస్ అధికారి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
కొత్తపేట పరిధిలోని చైతన్యపురిలో సిఐడి విభాగం ఎస్పీ హోదాలో కిషన్ సింగ్ పనిచేస్తున్నారు.ఆయనకు టీఎస్ఎస్పీడీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ అనురాధ పరిచయమయ్యారు.భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమెపై కన్నేసిన కిషన్ సింగ్ లైంగిక వేధింపులు గురి చేసేవారు. 2020,21సంవత్సరంలో సరూర్ స్టేడియంలో నేషనల్ కాంపిటీషన్స్ కు ఆమె ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయం నుంచి కన్నేసిన డీఎస్పీ కిషన్ సింగ్ మానసికంగా, లైంగికంగా వేధించేవారు. సిఐడి విభాగం ఎస్పీ హోదాలో ఉండి చిల్లర బుద్ధి చూపించేవారు. సాయం ముసుగులో సైట్ కొట్టే ప్రయత్నం చేసేవారు. చాలాసార్లు హెచ్చరించినా వినకపోవడంతో ఆ మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది.
అనురాధ భర్త చనిపోయి ఒంటరిగా ఉంటోంది. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నానని చెప్పి.. తప్పకుండా హాజరుకావాలని కిషన్ సింగ్ ఆమెకు ఆదేశాలు ఇచ్చేవాడు. ఫోన్ నెంబర్ తీసుకొని నిత్యం వేధింపులు గురిచేసేవాడు.అసభ్యకరమైన పదజాలాలతో మెసేజ్ లు పంపేవాడు. రొమాంటిక్ సాంగ్ పంపించి ఆమె అభిప్రాయాలని కనుక్కునేవాడు. తనను కలవడానికి వచ్చినప్పుడు చీర కట్టుకొని రావాలని సూచించేవాడు. దీంతో కొన్ని రోజులు పాటు కిషన్ సింగ్తో బాధిత మహిళ మాట్లాడడం మానేసింది.
ఓ కేసు విషయంలో కిషన్ సింగ్ తో మాట్లాడాల్సి వచ్చింది. తాను చెప్పినట్లు నడుచుకుంటేనే కేసు విషయంలో సాయం చేస్తానని ఆయన కండిషన్లు పెట్టారు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీంతో కిషన్ సింగ్ పై దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీస్ శాఖలో సైతం కీచక పర్వం కొనసాగుతుండటం జుగుప్సాకరంగా మారింది.