Nora Fatehi: హీరోయిన్ నోరా ఫతేహి క్యాస్టింగ్ కౌచ్ పై పెదవి విప్పారు. తనకు కూడా ఆ అనుభవాలయ్యాయని ఓపెన్ అయ్యారు. కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, సింగర్. అలాగే ప్రొఫెషనల్ డాన్సర్. నటి కావాలనే ఆసక్తితో ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టారు. 2014లో రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్ బన్స్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం దర్శకుడు పూరి జగన్నాధ్ టెంపర్ మూవీలో స్పెషల్ సాంగ్ చేయించాడు. టెంపర్ లో ఎన్టీఆర్, నోరా ఫతేహి కలిసి ఓ సాంగ్ లో డాన్స్ చేశారు.
అదే ఏడాది వరుసగా బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో నోరా ఫతేహి ఐటెం సాంగ్స్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లులో నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవల వరుణ్ తేజ్ తో మరో ప్రాజెక్ట్ ప్రకటించింది. మట్కా టైటిల్ తో తెరకెక్కనున్న పీరియాడిక్ క్రైమ్ డ్రామాలో నోరా ఫతేహి హీరోయిన్.
మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్ గా నటిస్తుంది. చెప్పాలంటే నోరా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. కాగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. కెరీర్ బిగినింగ్ లో తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని కుండబద్దలు కొట్టారు. కొందరు బలవంతంగా నన్ను డేటింగ్ చేయమన్నారు. కాంప్రమైజ్ కావాలని ఇబ్బందిపెట్టారు. అయితే నేను లొంగలేదు. నా దారిలో నేను వెళ్ళాను.
కస్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఏ హీరోతో ఎఫైర్ పెట్టుకోవడం వలన, రాసుకుపూసుకు తిరగడం వలన నేను ఎదగలేదు అన్నారు. ఎఫైర్ పెట్టుకుంటే అవకాశాలు ఇస్తామని కొందరు ఆఫర్ చేశారని నోరా ఓపెన్ అయ్యింది. నోరా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. కంగనా రనౌత్, తనుశ్రీ దత్త పాయల్ ఘోష్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. తనుశ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు చేశారు. ఇక పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేసినట్లు కేసు పెట్టింది. .