Viral Photo: ప్రతి మనిషి మెదడు 1350 గ్రాములే ఉంటుంది. అది ఉపయోగించుకునే తీరును బట్టి వినియోగం పెరుగుతుంది. ఒకరికి సినిమా పాటలు అన్ని బాగా గుర్తుంటాయి. మరొకరికి తన బాల్యం నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు అన్ని మరిచిపోరు. అంటే మన మెదడు మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి మారుతుంటుంది. ఇటీవల కాలంలో పజిల్స్ ప్రజలను బాగా ఆకర్షితులను చేస్తున్నాయి. దీంతో వాటి పట్ల తమ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. మెదడుకు మేతగా పజిల్స్ రూపుదిద్దుకుంటున్నాయి.

ఈ మధ్య కాలంలో ఫొటో పజిల్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఏదో ఓ ఫొటో ఇచ్చి అందులో ఏదో ఒక పాయింట్ కనిపెట్టమని చెబుతున్నారు దీంతో ప్రతి వారు తమ మెదడుకు పని చెబుతున్నారు. ఫొటోలో దాగున్న దాన్ని కనిపెట్టాలని సవాల్ విసురుతున్నారు. దీంతో దాన్ని కనుగొనే క్రమంలో నానా తంటాలు పడుతున్నారు. తాజాగా ఇలాంటి కోవకు చెందిన ఓ ఫొటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో ఆ ఫొటోను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అందులో సూచించిన పాయింట్ పైనే దృష్టి సారిస్తున్నారు.
Also Read: IPL 2022: సన్ రైజర్స్ గెలుపుతో చెన్నై, ముంబైలపై మీమ్స్.. మీకు లైఫ్ లో సీరియస్ నెస్ రాదారా..!
ఇక్కడ ఫొటోలో చెట్టు మొదలు దాని చుట్టు పిచ్చిమొక్కలు ఉన్నాయి. అందులో మొక్కల చాటున ఓ భయంకరమైన పాము దాగి ఉంది. అది కాస్త మట్టి రంగులో ఉండటంతో కనిపెట్టడం కష్టంగా మారింది. పజిల్ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పామును కనిపెట్టేందుకు తెగ ఇదైపోతున్నారు. కానీ అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. దీంతో వారు మాత్రం తగ్గేదేలే అని చెబుతున్నారు. పజిల్ ను కచ్చితంగా గుర్తించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో అందరిని ఊరిస్తున్న పజిల్స్ గురించి ఆసక్తి చూపుతున్నారు. పజిల్ ను సాల్వ్ చేసే క్రమంలో తమ కళ్లకు పని చెబుతున్నారు. పాము ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. చిత్రాన్ని పదేపదే చూస్తూ పరీక్షగా చూస్తూ పామును కనిపెట్టాలని ఆతృత ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి ఎవరో కొందరు కనిపెడుతున్నా మరికొందరు మాత్రం తమ వల్ల కావడం లేదని చెబుతుండటం విశేషం.
Also Read:Pawan Kalyan Rythu Bharosa Yatra: కౌలు రైతుల కుటుంబాల కన్నీళ్లు తుడిచిన పవన్ కళ్యాణ్