KGF Chapter 2: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాకి టికెట్ రేట్లును పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్ 2’ సినిమా యూనిట్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
‘కేజీఎఫ్ 2’ సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని తాజాగా తెలంగాణ సర్కార్ జీవో జారీ చేయడం విశేషం. కాకపోతే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రేంజ్ లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి వీలు లేదు. మల్టీప్లెక్స్ లో 50 రూపాయలు, ఏసీ థియేటర్లో 30 రూపాయలను మాత్రమే పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం షరతు పెట్టింది.
Also Read: Tollywood No 1 Hero: టాలీవుడ్ నెంబర్ 1 హీరో అతనే అట.. తేల్చి చెప్పిన సెన్సేషనల్ సర్వే
పైగా ఈ సినిమా విడుదలైన 4 రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్ ను ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో, చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. నిజానికి తెలంగాణలో ‘కేజీఎఫ్ 2’కి ప్రభుత్వం నుంచి ఇంత సపోర్ట్ వస్తోందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే, అనూహ్యంగా కేజీఎఫ్ 2 పై తెలంగాణ ప్రభుత్వం ప్రేమ చూపించడానికి కారణం కేటీఆర్.
కేటీఆర్ గతంలో కొన్ని సభల్లో కూడా కేజీఎఫ్ 2 సినిమాలోని హీరో డైలాగ్స్ ను తనకు అనుగుణంగా చెప్పారు. పైగా తనకు కేజీఎఫ్ 2 చిత్రం చాలా బాగా నచ్చింది అని కేటీఆర్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు కేజీఎఫ్ 2కి దక్కిన వరం వెనుక కేటీఆర్ హస్తం ఉంది. అభిమానంతో ఈ సినిమా తన స్థాయిని పెంచుకుంటూ పోతుంది.
యూఎస్ లో కూడా ఈ సినిమాకి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే.. ఇది ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది.
అందుకే, దేశంలోని అన్ని పరిశ్రమల్లో కేజీఎఫ్ 2 చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించే విధంగా ఈ చిత్రానికి బుకింగ్స్ జరుగుతున్నాయి.
Also Read:Central/State Governments: కేంద్రంతో రాష్ట్రాలు ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి?