Thunderbolts : పిడుగు గురించి మనకు తెలుసు. అది పడిందంటే ఇక ప్రాణాలు పోవడమే. అంతడి శక్తి ఉంటుంది దానికి. ఈ నేపథ్యంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అనేక మంది పిడుగుపాటుకు గురై చనిపోయారు. పిడుగు ఎలా పడుతుంది? ఎందుకు పడుతుంది? ఎక్కడ పడుతుందనే విషయాలపై మనకు అవగాహన ఉంది. పిడుగులు ఎక్కువగా ఎత్తైన ప్రాంతాలు, చెట్ల మీద పడుతుంటాయి. ఇంకా
పిడుగు అంటే ఏమిటి?
పిడుగు అంటే వానలు కురిసేటప్పుడు మబ్బుల నుంచి అత్యంత శక్తివంతమైన విద్యుత్ విడుదల అవుతుంది. అది భూమికి చేరేటప్పుడు పడేదాన్ని పిడుగు అంటారు. ఆ సమయంలో భారీ ఉరుములు, మెరుపులు వస్తాయి. ఇలా పిడుగు పడేటప్పుడు మనం భయంకరమైన చప్పుళ్లు రావడం సహజం. దీంతో మనకు ఒక్కోసారి భయం వ్యక్తం చేస్తుంటాం.
పిడుగు పడే సందర్భంలో..
పిడుగులు ఏప్రిల్, నెలల్లో అకాల వర్షాల సమయంలో కూడా పిడుగులు పడుతుంటాయి. వర్షాకాలంలో పిడుగులు పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. పిడుగులు పడే సందర్భంలో 15 నిమిషాల ముందే మనకు తెలుస్తుంది. దీనికి ఓ యాప్ ఉంది. దాన్ని మనం డౌన్ లోడ్ చేసుకుంటే ముందే మనకు పిడుగు పడే విషయం తెలుస్తుంది. దీంతో మనం అక్కడి నుంచి దూరంగా వెళ్లొచ్చు.
పిడుగు పడినప్పుడు..
పిడుగు పడేటప్పుడు 300 మిలియన్ వాట్ల విద్యుత్ పుడుతుంది. పిడుగు పడినప్పుడు 30 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత విడుదల అవుతుంది. గంటకు సుమారు 4.34 లక్షల కిలోమీటర్ల వేగంతో పిడుగు పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 30 లక్షల పిడుగులు పడుతుంటాయి. సెకనుకు సుమారు 44 పిడుగులు పడుతున్నట్లు పడుతుంటాయి.
ఎలా ఉపయోగించాలి
గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి damini lightning alert అనే యాప్ ను డౌన్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకున్నాక యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, అడ్రస్, పిన్ కోడ్ వంటి సమాచారం ఇవ్వాలి. మీ జీపీఎస్ లో లొకేషన్ తెలుసుకోవడానికి యాప్ కు అనుమతి ఇవ్వాలి. దీంతో మన చుట్టు 40 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్కిల్ ను యాప్ గీస్తుంది. పిడుగు పడే అవకాశం ఉందని 15 నిమిషాల ముందు తెలియజేస్తుంది.