https://oktelugu.com/

Do Not Eat With Curd : పెరుగుతోపాటు వీటిని తినడం మంచికాదు తెలుసా?

ఎప్పుడు కూడా పెరుగును ఉల్లిపాయతో తినొద్దు. పెరుగుతో ఉల్లిపాయను తీసుకుంటే అలర్జీ వస్తుంది. తామర, సోరియాసిస్, గ్యాస్, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2023 6:16 pm
    Follow us on

    Do Not Eat With Curd : మనం రోజు తినే ఆహారంలో పెరుగును కూడా చేర్చుకుంటాం. ఎన్ని కూరలతో భోజనం చేసినా చివరకు రెండు బుక్కలయినా పెరుగుతో తినడం అలవాటు చేసుకుంటాం. దీని వల్ల ఎన్నో ప్రొటీన్లు అందుతాయి. పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఒక రోజు పులియబెట్టన పెరుగు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఈ నేపథ్యంలో పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తినకూడదు. అలా తింటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది.

    ఎప్పుడు కూడా పెరుగును ఉల్లిపాయతో తినొద్దు. పెరుగుతో ఉల్లిపాయను తీసుకుంటే అలర్జీ వస్తుంది. తామర, సోరియాసిస్, గ్యాస్, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉల్లిని పెరుగుతోపాటు తినడం మంచిది కాదు. పెరుగు తినేటప్పుడు ఉల్లికి దూరంగా ఉండడమే మనకు శ్రేయస్కరం. అందుకే ఉల్లిని పెరుగుతోని తీసుకోవడం మరిచిపోవాలి.

    పాల నుంచే పెరుగు వస్తుంది. కానీ పెరుగుతోపాటు పాలు తీసుకోవడం అంత మంచిది కాదు. ఆయుర్వేదంలో ఈ రెండు కలిపి తినడం వల్ల ఇబ్బందులు వస్తాయి. పాలు, పెరుగు కలిపి తినడం వల్ల అతిసార, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకే పాలతో పెరుగు తినడానికి చొరవ చూపడం అంత సురక్షితం కాదు.

    పెరుగుతోపాటు మామిడి తినడం కూడా చేయవద్దు. దీంతో చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. జీర్ణక్రియలో మార్పులు చోటుచేసుకుంటాయి. చేపలతో పాటు పెరుగు తీసుకోవద్దు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ రెండు ఆహారాలు తినకూడదు. వాటిని తినడం వల్ల అజీర్ణం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.