https://oktelugu.com/

Love Story: 5 రోజుల తర్వాత చనిపోయిన ప్రియుడొచ్చాడు.. ఆ ప్రియురాలి పరిస్థితి చూడాలి

ఓ యువతి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును పెట్టింది. రెడ్డీట్లో పోస్ట్ చేసింది. ఆ వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ జంట గత కొంతకాలంగా ప్రేమలో ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : March 7, 2024 / 05:35 PM IST

    Love Story

    Follow us on

    Love Story: రకరకాల కారణాలతో ప్రేమికులు విడిపోతుంటారు. ఇష్టం లేక కొంతమంది బ్రేకప్ చెప్తారు. పెద్దవారు ఒప్పుకోలేదనో.. లేకుంటే ఆమెతో వివాహ జీవితానికి ఇష్టపడకో రకరకాల కారణాలు చెబుతుంటారు. అయితే ప్రేమించిన వారు నేరుగా చెప్పడానికి సాహసించరు. దానికోసం కుంటి సాకులు వెతుకుతారు. లేనిపోని వివాదాలను తెరపైకి తెస్తారు. అయితే ఓ ప్రేమికుడు తాను చనిపోయానని ఆమెకు నమ్మిస్తాడు. అందుకు తన తల్లిని సాక్ష్యంగా పెడతాడు. తల్లి సెల్ ఫోన్ నుంచి తన కుమారుడు చనిపోయాడు అంటూ సమాచారం ఇచ్చాడు. ఆ మరుక్షణం నుంచి జీవచ్ఛవంలా మారి రోధించిన ఆమె ఐదు రోజుల తర్వాత అసలు నిజం తెలుసుకుంటుంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ కథనాన్ని మిర్రర్ వెబ్సైట్ నివేదికలో తెలిపింది.

    ఓ యువతి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టును పెట్టింది. రెడ్డీట్లో పోస్ట్ చేసింది. ఆ వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ జంట గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఉన్నట్టుండి ఓ రోజు ప్రేమికుడి తల్లి సెల్ ఫోన్ నుంచి ప్రేమికురాలికి ఒక సందేశం వచ్చింది. తన కుమారుడు చనిపోయాడని.. గుర్రపు స్వారీలు కిందపడి పోయాడని.. గుర్రం ఆయన గుండె మీదుగా వెళ్లడంతో చనిపోయాడంటూ మెసేజ్ వచ్చింది. దానిని చూసిన ప్రేమికురాలు ఒక్కసారిగా షాక్ కు గురైంది. అదే పనిగా రోదిస్తూ ఐదు రోజులు పాటు సాగింది. ప్రేమికుడి స్నేహితుల ద్వారాఆమె షాకింగ్ కర విషయాలు తెలుసుకుంది.

    కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వారి మధ్య చిన్నచిన్న అరమరికలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆమెను వదిలించుకోవడానికి ప్రియుడు ప్రయత్నించాడు. ఆ విషయం ఆమెతో నేరుగా చెప్పడానికి సాహసించలేకపోయాడు. అందుకే తల్లి సెల్ ఫోన్ నుంచి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు స్నేహితుల ద్వారా ఆ యువతి తెలుసుకుంది.నేరుగా ప్రేమికుడికే ఫోన్ చేసింది. జరిగిన ఘటనపై నిలదీసింది. కానీ ప్రేమికుడు నుంచి మౌనమే సమాధానమైంది. కొద్దిసేపటికే అతను సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకుంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రేమికుడిని తప్పుపడుతూ.. బాధిత ప్రేమికురాలిని ఓదార్చారు.