https://oktelugu.com/

Car Loan: ఈజీగా కారును ఇంటికి తీసుకెళ్లండి.. ఏ బ్యాంకులో ఎంత తక్కువ వడ్డీ రేటంటే?

సాధారణంగా బ్యాంకులు క్రెడిట్ స్కోర్ 750. అంతకంటే ఎక్కువగా ఉన్న కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. మరి కొన్ని బ్యాంకులు కారు ఆన్ రోడ్ ధరలో 80 శాతం నుంచి 90 శాతం వరకు లోన్స్ ఇస్తున్నాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 7, 2024 / 05:29 PM IST

    Car Loan

    Follow us on

    Car Loan: భారత్ లో ప్రస్తుతం కార్ల వినియోగం రోజురోజుకి బాగా పెరిగిపోతుంది.. సొంత ఇల్లుతో పాటు కారు ఉండాలని ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు. ఇందుకోసం సరసమైన ధరల్లో కారును కొనుగోలు చేయాలని కొందరు భావిస్తుంటారు. మరి కొందరు కారును కొనాలనే కలను సాకారం చేసేందుకు పలు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు. ప్రస్తుతం చాలా బ్యాంకులు కార్ల కొనుగోలుకు విరివిగా లోన్లు మంజూరు చేస్తున్నాయి. తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని చెబుతున్నాయి.అందులో వాస్తవం ఎంతనేది ముందే చెప్పలేం.

    సాధారణంగా బ్యాంకులు క్రెడిట్ స్కోర్ 750. అంతకంటే ఎక్కువగా ఉన్న కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. మరి కొన్ని బ్యాంకులు కారు ఆన్ రోడ్ ధరలో 80 శాతం నుంచి 90 శాతం వరకు లోన్స్ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే మీరు కూడా లోన్ తీసుకుని కారు కొనుక్కోవాలని అనుకుంటున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

    కెనరా బ్యాంకు కారు లోన్లపై విధించే వార్షిక వడ్డీ రేటు 8.70 శాతంగా ఉండగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కారు రుణాలపై వడ్డీ రేట్లు సుమారు 8.75 శాతం నుంచి ఉన్నాయని చెప్పుకోవచ్చు..యాక్సిస్ బ్యాంకులో వడ్డీ రేటు 8.98 శాతంగా ఉండగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో వార్షిక వడ్డీ 8.75 నుంచి ప్రారంభంకానుంది.

    అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకులో కారు లోన్ల వడ్డీ రేట్లు 8.80 శాతంగా ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఫెడర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేట్లు 8.85 శాతం ఉన్నాయి. కర్ణాటక బ్యాంకులో లోన్ వడ్డీ రేట్ 8.98 శాతం, ఐసీఐసీఐ బ్యాంకులో వడ్డీ రేటు 9.10 శాతం, సౌత్ ఇండియన్ బ్యాంకులో 9.27 శాతంగా ఉంది.

    ఇక తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్లు10.70 శాతం నుంచి ప్రారంభం అవుతుండగా.. కరూర్ వైశ్యా బ్యాంకులో కారు రుణాలపై వడ్డీ రేట్లు 9.55 శాతం నుంచి మొదలవుతున్నాయి.