
Shah Rukh Khan Remuneration: సినిమాల్లో అవకాశాలు రావడమే గొప్ప.. అందులోనూ రాణించాలంటే గగనమే. కానీ కొందరికి అదృష్టం లక్కలాగా పట్టుకుంటుంది. అనతి కాలంలోనే స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని లైఫ్ లాంగ్ సినిమాల్లో నటిస్తారు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా కొందరు అవకాశాలను చేజిక్కించుకొని ఉన్నత స్తితికి మారిపోతుంటారు. 1980లల్లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లలో చాలా మంది ఇలాంటి నటులు అవకాశాలను విడిచిపెట్టకుండా ఇప్పటికీ నటిస్తున్నారు. దీంతో రోజులు మారినకొద్దీ వారి రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగింది. ఇండస్ట్రీలోకి కుర్ర హీరోలు ఎంత మంది వచ్చినా సీనియర్ స్టార్ హీరోల క్రేజ్ మాత్రం తగ్గలేదు.
బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో కు ఇప్పుడు అలాంటి ఇమేజ్ అలాగే కొనసాగుతూ ఉంది. దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆయన ఇప్పటికీ హీరోగానే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సాధారణంగా హీరోయల సినీయారిటీతో వారి రెమ్యూనరేషన్ తగ్గుతుంది. కానీ ఈ హీరో రెమ్యూనరేషన్ మాత్రం విపరీతంగా పెరిగింది. ప్రస్తతం ఆయన తీసుకుంటున్న పారితోషికం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో చూద్దాం..
బాలీవుడ్ లో బాద్షాగా పేరొందిన షారుఖ్ ఖాన్ కు ఇప్పటికీ ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. ఫ్యాన్స్ క్రేజీని దృష్టిలో పెట్టుకొని ఆయన డిఫరెంట్ చిత్రాలు తీస్తూ అలరిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ లీటేస్టుగా నటించిన మూవీ ‘పఠాన్’. ఈ మూవీ 2023 జనవరి 25న రిలీజైంది. మొదట్లో ఈ సినిమా ప్లాప్ అన్నారు. కానీ ఓవరాల్ గా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇందులో షారుఖ్ కు జోడీగా దీపికా పదుకునే నటించింది. హిట్ ఫెయిర్ గా నిలిచిన ఈ జంట ‘పఠాన్’ ను కూడా సక్సెస్ చేసుకోవడంతో ఇండస్ట్రీలో వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.

ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమాకు షారుఖ్ భారీగా పారితోషికం తీసుకున్నాడట. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆయన రెమ్యూనరేషన్ ప్రకారం గా కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పాడట. అలా ఈ సినిమాలకు వచ్చిన లాభాల్లో షారుఖ్ కు వచ్చిన వాటా రూ.200 కోట్లు. అంటే షారుఖ్ ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ రూ.200 కోట్లు అన్నమాట. ఇప్పటి వరకు ఏ హీరో తీసుకోలేనంత రెమ్యూనరేషన్ షారుఖ్ సొంతం చేసుకున్నాడని ఇండస్ట్రీలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.