ముక్కు అవినాష్.. మంచి కమెడియన్. బిగ్‌బాస్ హౌజ్‌లోకి అవినాష్ అడుగుపెట్టాకే ఇంతో అంతో ఎంటర్టైన్మెంట్ పెరిగిందని చెప్పొచ్చు. ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ కనిపించే అవినాష్ నిన్నటి బిగ్‌బాస్ ఎపిసోడ్లో ఒక్కసారిగా బాంబ్ పేల్చాడు. లాక్డౌన్ టైంలో ఆర్థిక పరమైన ఇబ్బందులతో సూసైడ్ చేసుకుందామని అనుకున్నాననంటూ చెప్పుకొచ్చాడు. అవినాష్తోపాటే హౌజ్‌లోని మిగితా కంటెస్ట్‌లు కూడా తమ లైఫ్ స్ట్రగుల్స్ చెప్పుకుంటూ ఎమోషన్ అయ్యారు.
Also Read: అనుష్కకు నో చెప్పిన జక్కన్న.. అలియాకు ఓకే అంటాడా?
ముఖ్యంగా అవినాష్ మాట్లాడుతూ.. తను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానంటూ తెలియజేశాడు. ‘నేను లైఫ్‌లో రెండే నమ్ముతా.. ఒకటి పేరెంట్స్, రెండు ప్రేక్షకులు. నేను ఫ్రెండ్స్‌ని కూడా ఫ్యామిలీ కిందే లెక్కేస్తా. వాళ్లని వేరు చేయలేను. నాకు ఇప్పుడు 30 ఏళ్లు.. నేను ఈ ఏజ్‌లో ఒక ఇళ్లు కొనుక్కున్నాను.. కారు కొనుక్కున్నాను అంటే.. దానికి కారణం ప్రేక్షకులు. నా పేరెంట్స్, ప్రేక్షకులు లేకపోతే.. ఈ ముక్కు అవినాష్ మీ ముందు ఉండేవాడు కాదు.. నన్ను ఒక స్థాయికి తీసుకువచ్చారు.. నన్ను అభిమానిస్తున్నారు’ అని అన్నాడు.
‘నేను రీసెంట్గా ఈ లాక్ డౌన్లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఈ లాక్ డౌన్ ఏంటంటే.. అందరూ బాగున్నారు.. కానీ ఎవరికైనా కష్టం వస్తే ఆర్టిస్ట్ రెస్పాండ్ అవ్వాలి. మన దగ్గర డబ్బులు లేకపోయినా మనల్ని అభిమానించే వాళ్లకి సాయం చేస్తాం. ఎందుకంటే మనం ఇలా ఉన్నాం అంటే వాళ్ల వల్లే కాబట్టి. వాళ్లకి కష్టం వస్తే హెల్ప్ చేయాలి. అయితే నేను ఈ మధ్యే కొత్తగా ఇళ్లు కొన్నాను. దాని ఈఎంఐ నెలకు రూ.45 వేలు. అది కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. అందరూ అనుకోవచ్చు. ఈఎంఐ కట్టలేనప్పుడు ఇల్లు ఎందుకు కొన్నావ్ అని. కట్టగలను అనే నమ్మకం ఉంది కాబట్టే ఇల్లు కొన్నాను. కానీ అదే టైంలో నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. స్టంట్స్ పడ్డాయి. రూ.4 లక్షలు ఖర్చయ్యింది. ఆ డబ్బు నేను ఇల్లు కోసం దాచింది. అప్పటికే ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చేశాను. అదే టైంలో అమ్మకి మోకాళ్లు అరిగిపోయాయి. దానికి కూడా డబ్బు అయ్యిందని’ ఆవేదన చెందాడు.
‘మేం ఐదుగురు అన్నదమ్ములం.. వాళ్లు డబ్బు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో నేను ఖర్చు చేయాల్సి వచ్చింది. అదే టైంలో ఇల్లు తీసుకోవాల్సిరావడంతో బయట నుంచి రూ.13 లక్షలు అప్పు చేశాను. నేను అప్పులు చేసింది మా అమ్మానాన్న కోసం.. వాళ్లు బాగుండాలి అనుకున్నాను.. వాళ్లు బతికి ఉండగానే చూసుకోవాలి. ఉన్నప్పుడే కాపాడుకోవాలి.. పేరెంట్స్‌ని రెస్పెక్ట్ చేయండి’ అంటూ ప్రేక్షకులకు దండం పెట్టి చెప్పాడు అవినాష్.
Also Read: సినీ ప్రియులు పండుగ చేసుకోండి..!
అవినాష్ మాటలు ప్రేక్షకులను చాలా కన్ఫ్యూజ్గా అనిపించాయి. తన ఆర్థికపరమైన ఇబ్బందుల్ని తెలియజేస్తూ లాక్ డౌన్లో ఆర్టిస్ట్‌లు రెస్పాండ్ అవ్వాలని అంటారని.. వాళ్ల దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సాయం చేయాలని ప్రస్తావించారు. అయితే అవినాష్ అలా సాయం చేసిన దాఖలాలు లేవు. మరి తన ఆత్మహత్యాయత్నం గురించి ప్రేక్షకులకు ఎందుకు ముడిపెట్టాడో చెప్పలేదు. అవినాష్ తన పేరేంట్స్ కోసం.. ఇల్లు కోసం అప్పు చేసి ఇబ్బందులు పడితే ఆ విషయాన్ని లాక్ డౌన్లో ఇబ్బందులు పడుతున్న ప్రేక్షకులతో ఎందుకు ముడిపెట్టాడన్నది క్లారిటీ ఇవ్వలేదు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Bigg boss if you want to commit suicide avinash%e2%80%8c emotion%e2%80%8c
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com