https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : ఇక నుండి ‘ఆహా’ లో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్..త్వరలోనే ప్రకటన..హోస్ట్ ఎవరో తెలుసా?

Bigg Boss 7 Telugu : తెలుగు బుల్లితెర పై ప్రభంజనం సృష్టించిన రియాలిటీ షో ఏది అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు బిగ్ బాస్.ప్రతి ఏడాది సరికొత్త సీజన్ తో మన ముందుకు వచ్చే బిగ్ బాస్ సీజన్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇంతటి ఎంటర్టైన్మెంట్ ని పంచిన రియాలిటీ షో గడిచిన పదేళ్లలో మరొకటి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2023 / 07:43 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : తెలుగు బుల్లితెర పై ప్రభంజనం సృష్టించిన రియాలిటీ షో ఏది అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు బిగ్ బాస్.ప్రతి ఏడాది సరికొత్త సీజన్ తో మన ముందుకు వచ్చే బిగ్ బాస్ సీజన్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇంతటి ఎంటర్టైన్మెంట్ ని పంచిన రియాలిటీ షో గడిచిన పదేళ్లలో మరొకటి లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    ఇప్పటి వరకు ఈ రియాలిటీ షో మన తెలుగు లో ఏకంగా ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకుంది, ఇప్పుడు అతి త్వరలోనే 7 సీజన్ కూడా ప్రారంభం కానుంది.అయితే ఆరు సీజన్స్ లో 5 సీజన్స్ ఒకదానిని మించి ఒకటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వగా, ఆరవ సీజన్ మాత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.టాస్కులు ప్రారంభం లో పెద్దగా ఆసక్తికరంగా లేకపోయినా, ఆ తర్వాతి నుండి మంచి టాస్కులనే ఏర్పాటు చేసారు.

    కానీ అప్పటికీ ఈ షో మీద ఆడియన్స్ కి పూర్తిగా ఆసక్తి పోవడం తో టీఆర్ఫీ రేటింగ్స్ అతి దారుణంగా పడిపోయాయి.అందుకే ఈసారి 7 వ సీజన్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బిగ్ బాస్ యాజమాన్యం.అయితే ఈ బిగ్ బాస్ టీం స్టార్ మా తో ఏర్పర్చుకున్న ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ గడువు ఆరవ సీజన్ తోనే ముగిసిపోయింది.ఇక సరికొత్త అగ్రిమెంట్ ఇప్పటి వరకు రెన్యూవల్ చేసుకోలేదు.మరోపక్క స్టార్ మా ఛానల్ తో పోటీగా జెమినీ టీవీ కూడా ఈ రియాలిటీషో ని ప్రదర్శించుకునేందుకు అప్లై చేసింది.

    అంతేకాకుండా డిజిటల్ మీడియా ప్లాట్ ఫారం కూడా మారిపోనుంది.ఇది వరకు అన్నీ సీజన్స్ డిస్నీ + హాట్ స్టార్ లో ప్రసారమయ్యేవి.కానీ ఇప్పుడు ‘ఆహా’ మీడియా స్ట్రీమింగ్ రైట్స్ కోసం పోటీ పడుతుంది. వాళ్ళకే ఇక డిజిటల్ రైట్స్ దాదాపుగా ఖరారు అయ్యిపోయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. ఇక ఆహా వాళ్లు హోస్ట్ గా నాగార్జున కంటే బాలకృష్ణతో చేయించడానికి రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరీ ఏం జరుగుతుందో?