Bigg Boss 6 Telugu Inaya Sultana: బిగ్ బాస్ హౌస్ లో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, గ్రూపులు అనేకం చోటు చేసుకుంటాయి. కీలక సమయాల్లో నమ్మినవాళ్లే హ్యాండ్ ఇస్తారు. కోలుకోలేని దెబ్బేస్తారు. కంటెస్టెంట్ సూర్యకు ఇనయా సుల్తానా అలాంటి షాకే ఇచ్చింది. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. గురువారం ఎపిసోడ్లో కెప్టెన్ కీర్తికి బిగ్ బాస్ ఒక బాధ్యత అప్పగించారు. బాగా ఎంటర్టైన్ చేసిన ఆరుగురు కంటెస్టెంట్స్ పేర్లు చెప్పాలి అన్నారు.ఫైమా, రేవంత్, బాల ఆదిత్య, గీతూ, రాజ్, సూర్య పేర్లను కెప్టెన్ కీర్తి సూచించారు.

ఈ ఆరుగురు కెప్టెన్సీ పోటీదారులుగా బిగ్ బాస్ నిర్ణయించారు. వీరి మధ్య నిర్వహించిన పోటీలో నెక్స్ట్ లెవల్ కి సూర్య, బాల ఆదిత్య, రేవంత్ వెళ్లారు. రాజ్, ఫైమా, గీతూ పోటీ నుండి నిష్క్రమించారు. ఈ ముగ్గురిలో కెప్టెన్ ని ఎంచుకోవాల్సి బాధ్యత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చాడు. కంటెస్టెంట్స్ ముగ్గురిలో కెప్టెన్ కావాలని కోరుకుంటున్న వ్యక్తి మెడలో కారణం చెప్పి దండ వేయాలి. మెజారిటీ కంటెస్టెంట్స్ కోరుకున్న వ్యక్తి కెప్టెన్ అవుతాడు.
ఓటింగ్ ప్రారంభం కాగా… కంటెస్టెంట్స్ తమకు ఇష్టమైన వ్యక్తి మెడలో దండలు వేశారు. ఇనయ వంతు వచ్చింది. ఆమెను చూసిన సూర్య ఆ దండ నాకే అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇనయా దండ తీసుకొని నేరుగా సూర్య వద్దకు వెళ్ళింది. చివర్లో షాక్ ఇస్తూ రేవంత్ మెడలో వేసింది. ఆ సంఘటన సూర్య మైండ్ బ్లాక్ చేసింది. కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు. సూర్య సంగతి పక్కన పెడితే ఇనయా, రేవంత్ లకు అసలు పడదు. అలాంటిది శత్రువు మెడలో ఆమె దండేసింది.

అదే సమయంలో కీలక సమయంలో సూర్యకు వెన్నుపోటు పొడిచింది. హౌస్ లో కెప్టెన్ కావడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎలిమినేట్ అయ్యే లోపు ఒక్కసారైనా కెప్టెన్ బ్యాడ్జ్ ధరించాలని కంటెస్టెంట్స్ కోరుకుంటారు. కెప్టెన్ అవడానికి సూర్య రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. నమ్ముకున్న ఇనయా అతనికి ఝలక్ ఇచ్చింది. ఇటీవల సూర్య అంటే నాకు చాలా ఇష్టం. అతడు నా క్రష్ అని ఇనయా నేరుగా చెప్పింది. కెప్టెన్సీ కంటెండర్ గా సూర్య ఫైనల్ కి చేరాడని తెలియగానే టైట్ హగ్ ఇచ్చింది.
ఫైనల్ లో మాత్రం ఓటు పక్కన వాళ్లకు వేసి అతన్ని నిరాశపరిచింది. ఇనయా అలా చేయడం నిజంగా షాకింగ్ పరిణామం. ఆమె చర్య వెన్నుపోటుకు పరాకాష్టగా ఉంది. కాగా మరో రెండు రోజుల్లో ఒక కంటెస్టెంట్స్ ఎలిమినేటై హౌస్ వీడనున్నారు. ఫైమా, చలాకీ చంటి, ఆదిరెడ్డి, అర్జున్, మెరీనా, ఇనయా, వాసంతి, బాల ఆదిత్య ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేటై వెళ్ళిపోతారు. గత నాలుగు వారాల్లో షాని, అభినయశ్రీ, నేహా , ఆరోహిరావు ఎలిమినేట్ కావడం జరిగింది. లేటెస్ట్ సీజన్ రేటింగ్ దారుణంగా ఉందని సమాచారం.