Megastar Chiranjeevi Godfather: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వసూళ్లు రాబడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..లిమిటెడ్ థియేటర్స్ మరియు అతి తక్కువ టికెట్ రేట్స్ తో కూడా ఇలాంటి వసూళ్లను రాబట్టొచ్చా అని గాడ్ ఫాదర్ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది..ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 92 కోట్ల రూపాయలకు జరిగింది..ఇది మెగాస్టార్ రేంజ్ కి తక్కువే అయ్యినప్పటికీ కూడా, నిర్మాతలు ప్లాన్ చేసిన వరస్ట్ రిలీజ్ ని చూసి కనీసం 70 కోట్ల రూపాయిలు అయినా ఈ సినిమా వసూలు చేస్తుందా అనే సందేహం మరియు భయం డిస్ట్రిబ్యూటర్స్ లో నెలకొంది..అయితే అందరి హీరోలుగా చిరంజీవి కూడా ఒకరు కాదు కదా..ఆయన స్థాయి వేరు స్థానం వేరు..లిమిటెడ్ రిలీజ్ మీద కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టిస్తూ తన దురాభిమానుల చెప్పు దెబ్బలు తగిలేలా చేస్తున్నాడు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సృష్టించిన మరో రేర్ రికార్డు ఇప్పుడు అభిమానులకు మరింత కిక్ ని ఇస్తుంది..అదేమిటి అంటే ఈ సినిమాకి ఈ మూడు రోజులకు గాను కలిపి కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో 30 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట..లిమిటెడ్ రిలీజ్ మీద ఈ స్థాయి లో టికెట్స్ అమ్ముడుపోవడం అంటే మాటలు కాదు..థియేటర్స్ మొత్తం ఎక్కడ చూసిన ఫామిలీ ఆడియన్స్ తో కళకళలాడిపోతున్నాయి..చిరంజీవి కి మాస్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ఫామిలీ ఆడియన్స్ లో కూడా అటువంటి ఫాలోయింగ్ ఉంది.

.ఆయన సినిమా వస్తే టాక్ తో సంబంధం లేకుండా థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు ఫామిలీ ఆడియన్స్..అలాంటిది హిట్ టాక్ వస్తే ఆగరు కదా అంటూ ట్రేడ్ విశ్లేషకుల నుండి వినిపిస్తున్న మాట..వీకెండ్ లోపే ఈ సినిమా 50 లక్షలకు పైగా టికెట్స్ అమ్మడుపోయిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని చెప్తున్నారు..గాడ్ ఫాదర్ తో పాటుగా విడుదలైన రెండు సినిమాలు చతికిల పడడం తో వీకెండ్ లో మరింత షోస్ ని పెంచబోతున్నారట..మాములు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వరూపం చూపించిన ఈ సినిమా వీకెండ్ లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.