Site icon OkTelugu

Anasuya Bharadwaj Second Marriage: అతని నుండి అనసూయకు రెండో పెళ్లి ప్రపోజల్… ఆలోచనలో పడ్డ స్టార్ యాంకర్!

Anasuya Bharadwaj Second Marriage: మీరు విన్నది నిజమే అనసూయకు రెండో పెళ్లి సంబంధం వచ్చింది. ఆమె దీనిపై స్పందించింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నటిగా యాంకర్ గా అనసూయ ఫుల్ బిజీ. కెరీర్ పీక్స్ లో ఉండగా రోజుకు లక్షలు సంపాదిస్తుంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాను వదలరు అనసూయ. వారంలో రెండు మూడు ఫోటో షూట్స్ షేర్ చేస్తారు. మిలియన్స్ లో ఫాలో అవుతున్న ఆమె ఫ్యాన్స్ ఫోటోలు వైరల్ చేస్తూ ఉంటారు. వ్యక్తిగత విషయాలు, టూర్స్, వెకేషన్ పిక్స్ ఫ్యాన్స్ తో పంచుకుంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా చిట్ చాట్ లో పాల్గొంటారు. తాజాగా అనసూయ అభిమానులతో ముచ్చటించారు. ఆన్లైన్ లో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

Anasuya Bharadwaj

ఈ క్రమంలో అనసూయకు ఓ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. నెటిజన్ అనసూయను పెళ్లి చేసుకుంటావా అడిగాడు. ‘నేను అనేకమార్లు మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాను. మీరు నాకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు,’ అని అనసూయను ఆన్లైన్ లో నిలదీశాడు. ఈ ప్రశ్నను ఇగ్నోర్ చేయకుండా అనసూయ సమాధానం చెప్పారు. నీ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాను, అని అర్థం వచ్చేలా థింక్ చేస్తున్నట్లున్న ఫోటో, ఎమోజీ పోస్ట్ చేసింది. ఇక అనసూయ సమాధానం ఇస్తుందని ఊహించని సదరు నెటిజెన్ షాక్ అయ్యాడు. దీంతో నెటిజెన్ ప్రశ్న, అనసూయ సమాధానం వైరల్ అయ్యాయి.

పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయంటే ఆమె గ్లామర్ పవర్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను సెలెబ్రిటీలు పట్టించుకోరు. సమాధానం ఇవ్వరు. అనసూయ అందరిలాంటి అమ్మాయి కాదు కదా… నెటిజన్ కి తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. కాగా భరద్వాజ్ ని అనసూయ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. భరద్వాజ్ కోసం అనసూయ అప్పట్లో పెద్ద ఫైట్ చేయడం విశేషం.

Anasuya Bharadwaj

జబర్దస్త్ షో అనసూయ ఫేట్ మార్చేసింది. ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చింది. వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్ వదిలేశారు. నటిగా ఆమెకు ఆఫర్స్ వస్తుండగా బుల్లితెర షోస్ పై దృష్టి తగ్గించారు. లేటెస్ట్ రిలీజ్ గాడ్ ఫాదర్ మూవీలో అనసూయ నటించిన విషయం తెలిసిందే. అనసూయ పలు సిరీస్లు, చిత్రాల్లో నటిస్తూ బిజీ కెరీర్ లీడ్ చేస్తున్నారు. ఆమె ఖాతాలో పుష్ప 2 వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Exit mobile version