Bhangarh Fort : 2009లో వచ్చిన అరుంధతి సినిమా మనందరినీ భయపెట్టింది. ఈ సినిమాలో యువరాణిని వశం చేసుకునేందుకు తాంత్రికుడు ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతడిని చంపుతుంది. కానీ, తర్వాత అతను తిరిగొచ్చి విధ్వంసం సృష్టిస్తాడు. ఇంచుమించు అరుంధతి సినిమాలో చూపించినట్లుగానే రాజస్థాన్‌లోని ఓ సంఘటన జరిగింది. ఓ తాంత్రికుడు యువరాణిని చంపించడం, అతని శాంపంతో ఆమె ప్రాణాలు కోల్పోవడం ఇలా అక్కడ చాలా జరిగాయి. ఆ తర్వాత నుంచి అల్వార్‌లో ఉన్న ఈ భాన్‌గఢ్ కోటను మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియాగా పిలుస్తున్నారు. ఈ కోట వెనుక కథ ఏమిటి? కోట చుట్టూ ఉన్న మిస్టరీ ఏమిటి తెలుసుకుందాం.
భాన్‌గఢ్ కోటలో దయ్యం ఉందా?
భాన్‌గఢ్ కోట చుట్టూ రెండ కథలు ఉన్నాయి. ఒకటి రాజుకు, సాధవుకు మధ్య జరిగిన సంఘటన, మరొకటి తాంత్రికుడు, యువరాణికి జరిగిన విషాద కథ. మొదటి కథ విషయానికి వస్తే.. పూర్వం భాన్‌గఢ్ కోట కట్టక ముందు ఆ ప్రాంతంలో ఓ సాధువు ఉండేవాడట. స్థానిక రాజు మధోసింగ్ ఆ ప్రాంతంలో ఓ కోట కట్టాలని, అందుకు అనుమతి ఇవ్వాలని సాధువును కోరాడు. అందుకు సాదువు కాస్త దూరం జరిగి కోట కట్టుకోమని అనుమతి ఇచ్చాడు. కానీ, కోట నీడ తనపై పడకూడదని షరతు పెట్టాడు. నీడ పడితే అపర నష్టం జరుగుతుందని హెచ్చరించాడు. సాధువుపై నీడపడకుండా కోటను కట్టుకున్నాడు మధోసింగ్. కానీ, మధోసింగ్ వారసుల్లో ఒకరు కోటను విస్తరించేందుకు ప్రయత్నించాడు. ఫలితంగా నీడ సాధువుపై పడింది. కొంతకాలానికే ఆ కోట, దాని పరిసర గ్రామాలపై కొందరు దండయాత్ర చేశారు. అందరినీ చంపేశారు.
రెండో కథ విషయానికి వస్తే.. ఇది ఒక తాంత్రికుడు, యువరాణి రత్నావతి మధ్య జరిగింది. ఆ యవరాణి కుటుంబం ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో ఆమె చాలా అందంగా ఉండేది. ఓ రోజు ఓ తాంత్రికుడు, యువరాణి రత్నావతిని చూపి మనసుపడ్డాడు. ఆమెను తన వశం చేసుకోవాలనుకున్నాడు. ఓ రోజు యువరాణి రత్నావతి, తన స్నేహితులతో క లిసి మార్కెట్‌కు వెల్లింది. అక్కడ సెంటు కొనుగోలు చేసింది. అయితే ఆ సెంటులో అప్పటికే తాంత్రికుడు క్షుద్రపూజలు చేసిన మత్తుమందు కలిపాడు. ఈ విషయాన్ని యువరాణి పసిగడుతుంది. వెంటనే ఆ తాంత్రికుడిని పట్టుకోవాలని తన సైనికులను ఆదేశించింది. సైనికులు అతడిని పట్టుకున్నారు. తర్వాత తాంత్రికుడిని రాళ్లతో కొట్టి చంపించింది యువరాణి. మరణించే ముందు ఆ తాంత్రికుడు ఒక శాంప వదిలాడు. రత్నావతితోపాటు ఆమె ఉండే కోట పరిసర ప్రాంతాలు నాశనమవుతాయని శపించాడు. అప్పటి నుంచి ప్రజలు భయంగా బతకడం మొదలు పెట్టారు. ఈ ఘటన జరిగిన కొంత కాలానికే మొఘల్ సైనికులు ఆ ప్రాంతంపై దండయాత్ర చేశారు. గ్రామాల్లో విధ్వంసం సృష్టించారు. కోటను వశం చేసుకుని రత్నావతి, ఆమె కుటుంబాన్ని చంపేశారు.
అప్పటి నుంచే వార్తలో..
యువరాణి మరణ తర్వాత భాన్‌గఢ్ కోట వార్తల్లో నిలిచింది. రత్నావతి కథ ప్రాచుర్యం పొందింది. చాలా మంది అటు వెళ్లాడానికి భయపడడం మొదలు పెట్టారు. రాత్రిళ్లు కోట వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. రోజులు, దశాబాద్దలు, శతాబ్దాలు గడిచాయి. ఈ భాన్‌గఢ్ కోట అందాలకు గుర్తింపు లభించింది. ఉదయం సందర్శకులతో ఈ కోట కళకళలాడుతుంది. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత అక్కడికి ఎవరూ వెళ్లడం లేదు. కొందరురాత్రి వెళ్లారు. దీంతో వారి శరీర ఉష్ణోగ్రతలు సడెన్‌గా పడిపోయాయి. వింత శబ్దాలు వినిపించాయి. గజ్జల శబ్దాలు, గాజుల శబ్దాలు అరుపులు వినిపించాయని చెప్పారు. అంతేకాదు. నల్ల చీర కట్టుకున్న ఓ మహిళ నీడ కూడా కోటలో తిరుగతుందని తెలిపారు. ఇక కోటలో వస్తువులు వాటంతట అవే కదలడం గమనించామని వెల్లడించారు.