Amaravathi Capital : అమరావతిపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏకంగా రూ.49 వేల కోట్లతో

రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరపడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 49 వేల కోట్లతో పనులు చేయించడానికి సంబంధించి టెండర్లు ఖరారు చేయనుంది.

Written By: Dharma, Updated On : October 17, 2024 11:21 am

Amaravathi Capital

Follow us on

Amaravathi Capital :  అమరావతి రాజధాని నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు అమరావతి విద్యుత్ దీప కాంతులతో సరికొత్త శోభతో అలరించింది.గత కొద్దిరోజులుగా అమరావతిలోని 25 వేల ఎకరాల భూమిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి.ఇందుకుగాను ప్రభుత్వం 36 కోట్లు కేటాయించింది.వందలాది యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ పనులు దాదాపు పూర్తయ్యాయి.మరి కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని నిర్మాణ పనులు యధాస్థితిలో కనిపించనున్నాయి.మరోవైపు కేంద్రం అమరావతి రాజధాని నిర్మాణానికి 15000 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది.వచ్చే నెల నాటికి తొలి విడతగా 3750 కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి.ఈ మేరకు ప్రపంచ బ్యాంకు సైతం సన్నాహాలు ప్రారంభించింది. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.అందుకే కీలక నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. దాదాపు 49 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవాలని సిఆర్డిఏ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

* గత ఐదేళ్లుగా నిర్వీర్యం
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది.అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు అందించారు.అటు ప్రభుత్వం సైతం మాస్టర్ ప్లాన్ తోఅమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది.అయితే ఇంతలో వైసిపి అధికారంలోకి రావడం..అమరావతి రాజధాని నిర్మాణం పై నిర్లక్ష్యం చేయడంతో..గత ఐదేళ్లుగా ఆ నిర్మాణాలు వృధాగా ఉండిపోయాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో మరోసారి అమరావతి అంశం తెరపైకి వచ్చింది.అయితే ఇప్పటికే ఐఐటి నిపుణులు వచ్చి అమరావతి నిర్మాణాలను పరిశీలించారు. అందుకే పెండింగ్లో ఉన్న పనులతో పాటు కొత్తవాటి నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

* కేంద్రం సాయం
కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైతం తమ వంతు సహకారం అందిస్తోంది.అందులో భాగంగా 15000 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులను మంజూరు చేసింది.వీలైనంతవరకు అమరావతి రాజధానికి నేరుగా నిధులు సమకూర్చడంతో పాటు వివిధ ప్రాజెక్టులు మంజూరు చేయడానికి కేంద్రం ముందుకు వస్తోంది.అయితే అన్నింటికీ మించి ఈ రెండున్నర సంవత్సరాలలో ఐకానిక్ భవనాలనిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.