Transgender : మారుతున్న ట్రాన్స్ జెండర్ల జీవితాలు… వీరిని పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తున్న యువత..

ఒకప్పుడు సమాజంలో ట్రాన్స్ జెండర్లను చిన్న చూపు చూసేవారు. ఆడ, మగ కాకుండా ప్రత్యేక వ్యక్తులుగా ఉన్న వీరిని హేళన చేసేవారు. కానీ వారు చేయని తప్పుకు వారిని ఎందుకు నిందిస్తారు? అని కొందరు అవగాహన కల్పించడంతో వారితో కలిసి జీవించడానికి ముందుకు వస్తున్నారు. ట్రాన్స్ జెండర్లను ఒకప్పుుడు పట్టించుకోని ప్రభుత్వాలు ఆ తరువాత వారికి ఓటు హక్కు కల్పిస్తోంది.

Written By: Neelambaram, Updated On : October 17, 2024 10:21 am

Transgender

Follow us on

Transgender : ముక్కు, మోహం తెలియని వ్యక్తులతో కలిసి ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ప్రేమ అనే బంధం ద్వారా వీరు కలిస్తే వారి ప్రయాణం జీవితాంతం ఉంటుంది. పురుషుడు, మహిళ.. ఎవరూ ప్రేమలో పడినా జీవితాంతం తనతో తోడుగా ఉండే వ్యక్తి వారే అని కొందరు నిర్ణయించుకుంటారు. అయితే ఈ బంధం మరింతగా బలపడానికి వివాహం అనే కార్యక్రమం ద్వారా ఒక్కటవుతారు. కానీ నేటి కాలంలో పురుషుడు, మహిళ ఇద్దరు కాకుండా.. పురుషుడు ట్రాన్స్ జెండర్ తో కూడా జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. వీరి మధ్య ఏర్పడిన ప్రేమ వారిని జీవితాంతం కలిసి ఉండేలా చేస్తోంది. ఇలా ప్రేమించుకున్న వారు ఆ తరువాత పెళ్లిళ్లు చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి బాటలోనే తాజాగా ఓ జంట వివాహం చేసుకుంది. వీరిలో ఒకరు యువకుడు కాదా.. మరొకరు ట్రాన్స్ జెండర్. వీరి గురించి వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు సమాజంలో ట్రాన్స్ జెండర్లను చిన్న చూపు చూసేవారు. ఆడ, మగ కాకుండా ప్రత్యేక వ్యక్తులుగా ఉన్న వీరిని హేళన చేసేవారు. కానీ వారు చేయని తప్పుకు వారిని ఎందుకు నిందిస్తారు? అని కొందరు అవగాహన కల్పించడంతో వారితో కలిసి జీవించడానికి ముందుకు వస్తున్నారు. ట్రాన్స్ జెండర్లను ఒకప్పుుడు పట్టించుకోని ప్రభుత్వాలు ఆ తరువాత వారికి ఓటు హక్కు కల్పిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. అలా తమిళనాడులో ఓ ట్రాన్స్ జెండర్ చట్ట సభల్లోకి వెళ్లారు. తెలంగాణలోనూ ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ప్రస్తుతం కొందరు వారికి జీవతాన్ని కూడా ఇస్తున్నారు. ట్రాన్స్ జెండర్లు కూడా మనసున్న మనుషులే అని వారు నిరూపిస్తుండగా.. వారితో జీవితాన్ని పంచుకోవడానికి కొందరు యువకులు ముందుకు వస్తున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ కు చెందిన కుమార్.. మ్యాడంపల్లికి చెందిన కరుణాంజలిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొంత కాలం నుంచి వీరి మనుసులు దగ్గరయ్యాయి. ఆ తరువాత వారు తరుచూ కలిసేవారు. ఈ క్రమంలో వీరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించడంతో కొందరు కలిసి వీరి పెళ్లి చేశారు. ఈ కార్యక్రమంలో తోటి ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.

ట్రాన్స్ జెండర్లు అంటే చిన్న చూపు చూడకుండా ఇప్పుడు వారు కూడా ఆడ, మగ వారితో సమానంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు వీరు వివిధ రకాలుగా ఉపాధిని పొందుతున్నారు. మరికొందరు ఉద్యోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో గృహ ప్రవేశానికి, బోనాల కార్యక్రమానికి వీరిని ఆహ్వానిస్తారు. ట్రాన్స్ జెండర్ల దీవెనలు ఫలిస్తాయని కొందరి నమ్మకం. అందుకే వీరితో శుభకార్యాలు కూడా చేయిస్తారు. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో లేదని తమకంటూ ఒక జీవితం ఉండడానికి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అంతేకాకుండా తమ లాంటి వారిపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని, వారి కోసం ప్రత్యేకంగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.