MLA Geeta Bharat Jain: ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను అవమానించేలా మాట్లాడడం, నలుగురిలోనే వారిపై చేయి చేసుకోవడం వంటి ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. తప్పు చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆవేశంలో చేయి చేసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలోని ఠానేలో ఓ మహిళా ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌పై చేయి చేసుకుంది.
అందరూ చూస్తుండగానే..
మహారాష్ట్రలోని ఠానే జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే సివిల్ ఇంజినీర్‌పై చేయి చేసుకోవడం కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ఇద్దరు ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొన్ని నిర్మాణాలను నేలమట్టడం చేయడంతో వర్షాకాలం ముందు చిన్నారులతోపాటు కొందరు ఆక్రమణదారులు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను ఎందుకు కూల్చారని నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ సివిల్ ఇంజినీర్‌పై ఆమె చేయిచేసుకొని దూషించారు.
చేయి చేసుకోవడం ఏమిటి?
అయితే ఎమ్మెల్యే తీరును ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. పొరపాటు అనిపిస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలి, లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కానీ, ఇలా చేయి చేసుకోవడం సరికాదని అంటున్నారు. ఐదేళ్లు పదవిలో ఉండే నేతలు అధికారం ఉందని ఇష్టానుసారం వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సమన్వయంతో పనిచేయాలి.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయి. ఇది ఏ నేతకైనా వర్తిస్తుంది. కానీ, అధికారం తమ చేతిలో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే అభాసుపాలు కాక తప్పదు. ఉద్యోగులు 30 ఏళ్లు సర్వీస్‌లో ఉంటారు. ప్రజాప్రతినిదుల పదవీకాలం ఐదేళ్లే. ప్రజల ముందు క్రెడిట్ కోసం అందరి మధ్య అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని ఎమ్మెల్యే తీరును పలువురు తప్పు పడుతున్నారు.
వీడియో వైరల్..
ఇదిలా ఉంటే.. ఠానే జిల్లా ఎమ్మెల్యే గీతా భరత్ జైన్ ఇంజినీర్‌పై చేయి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే తీరును చాలా మంది తప్పు పడుతున్నారు. కాగా, గీతా జైన్ గతంలో బీజేఈ నుంచి మేయర్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె బీజేపీ – శివసేన ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023