Pawan Kalyan vs TDP Media : ‘కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడుతాడట..’ ఈ సామెత ఎలా పుట్టిందో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను చూస్తే చంద్రబాబులోనూ అసూయ మొదలైపోయిందట.. తన సొంత కొడుకు లోకేష్ ను మించి పవన్ కళ్యాణ్ కు ఆదరణ రావడాన్ని ఇటు చంద్రబాబు జీర్ణించుకోవడం లేదు. అటు పచ్చ మీడియా కూడా కక్కలేక మింగలేక ఆయన వార్తలు కవర్ చేయలేక తొక్కేస్తోంది. దీనంతటికి కారణం పవన్ కళ్యాణ్ పాపులారిటీ.. చంద్రబాబు సభలకు మించి జనాలు.. ఈగలు తోలుకుంటున్న లోకేష్ కు మించిన ఆదరణ. ఇదే ఇప్పుడు పవన్ పై ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది.
నిజానికి పవన్ కళ్యాణ్ నే చంద్రబాబు వద్దకు వచ్చి మరీ చర్చలు జరుపుతున్నాడు. పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారన్న టాక్ టీడీపీలో ఉంది. బీజేపీని, టీడీపీతో కలిసి జనసేన పోటీచేసి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా జగన్ ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారు.
కానీ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేన కోసం పాటుపడడం లేదని ఎల్లో మీడియా ఇన్నాళ్లు కోడై కూసింది. జనసేనకు అంత బలం లేదని.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు తీసుకొని సైడ్ అయి పోవాలంటూ కారు కూతలు కూసింది. జనసేనకు ఓ 40 సీట్లలోపు ఇస్తే మహా ఎక్కువ అన్నట్టు ఎల్లో మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లింది.
కానీ నవ్విన నాపచేనే పండింది.. ఎల్లో మీడియా ప్రచారాలు.. చంద్రబాబు బలమైన మీడియాతో జనసేనను తక్కువ చేసే ప్రయత్నాలు చూసిన పవన్ కళ్యాణ్ ఒంటరిగానే జనాల్లోకి వెళ్లిపోయారు. వారాహితో తనేంటో చూపించాడు.

పవన్ కళ్యాణ్ వారాహియాత్రతో గోదావరి జిల్లాల్లో తిరిగితే ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నాడు. నాడు జగన్ పాదయాత్రకు ఎలాగైతే గల్లీలన్నీ జనసంద్రంతో నిండాయో.. అచ్చం అలానే జనం వస్తున్నారు. పవన్ ప్రసంగాలతో చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా వచ్చేసారి జనసేన బలంగా నిలబడడం ఖాయంగా కనిపిస్తోంది. మెజార్టీ సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాల్లో వేవ్ చూసి చంద్రబాబు, టీడీపీ నేతలకు నిద్రపట్టడం లేదు. ఇక తమతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు తీసుకుంటాడని టీడీపీ నేతలు భావిస్తే ఏకుమేకు అవుతున్న పవన్ క్రేజ్ ను చూసి పచ్చ బ్యాచ్ కు నిద్ర కరువవుతోంది. అందుకే మెల్లిగా పవన్ ను సైడ్ చేసేస్తున్నారు.
మొదటి రోజు పవన్ కళ్యాణ్ సభలకు పతాక శీర్షికన కవరేజ్ ఇచ్చిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి బలమైన మీడియా సంస్థలు ఇప్పుడు తొక్కేస్తున్నాయి. అస్సలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇచ్చినా సంబంధం లేని టాపిక్ తీసుకొని చంద్రబాబుకు,టీడీపీకి మేలు జరిగేలాగానే వ్యవహరిస్తున్నాయి. మీడియా కవరేజీని ఆపేస్తున్నాయి. పవన్ కు వస్తున్న ఆదరణను ప్రొజెక్ట్ చేయడం లేదు.
కానీ ఇది సోషల్ మీడియా కాలం.. మీడియా చానెల్స్ చూపించికపోయినా.. పత్రికలు రాయకపోయినా పవన్ మేనియా ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలోనే ఏ సభలకు రానంత వ్యూయర్ షిప్ జనసేన యూట్యూబ్ అకౌంట్ ఖాతాలో పవన్ సభ లైవ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఏకకాలంలో 50వేల మంది చూశారు. ఐపీఎల్ లాంటి మ్యాచ్ లకు వచ్చేంత వ్యూయర్ షిప్ పవన్ సభలకు రావడంతో ఎల్లో మీడియా బెంబేలెత్తిపోతోంది. పవన్ కవరేజిని తాము అడ్డుకున్న ప్రజలు మాత్రం యూట్యూబ్ లో చూసేస్తున్నారని అర్థం చేసుకుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే పవన్ మేనియాను కూడా ఆపడం ఈ ఎల్లో మీడియాకు సాధ్యం కాదని ఇప్పటికైనా గుర్తెరగాలి.