https://oktelugu.com/

స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే పాటించాల్సిన చిట్కాలివే..?

ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ వాడుతున్న చాలామంది ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదని చెబుతూ ఉంటారు. నెట్ స్పీడ్ విసిగించడం వల్ల ఫోన్ లో వీడియోలు కూడా చూడలేకపోయామని తెలుపుతూ ఉంటారు. సిగ్నల్ ఫుల్ గా ఉన్నా, ఫోన్ లో ఎటువంటి సమస్య లేకపోయినా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటంతో తల పట్టుకుంటూ ఉంటారు. దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో మెజారిటీ ప్రజలు 4జీ నెట్వర్క్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 3, 2020 / 07:33 PM IST
    Follow us on

    ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ వాడుతున్న చాలామంది ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదని చెబుతూ ఉంటారు. నెట్ స్పీడ్ విసిగించడం వల్ల ఫోన్ లో వీడియోలు కూడా చూడలేకపోయామని తెలుపుతూ ఉంటారు. సిగ్నల్ ఫుల్ గా ఉన్నా, ఫోన్ లో ఎటువంటి సమస్య లేకపోయినా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటంతో తల పట్టుకుంటూ ఉంటారు.

    దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో మెజారిటీ ప్రజలు 4జీ నెట్వర్క్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే జియో రాకతో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగింది. స్పెక్ట్రమ్ లిమిట్ పై ఆధారపడి ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ వినియోగారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం వల్ల ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం సులభంగా ఇంటర్నెట్ స్పీడ్ ను పెంచుకోగలుగుతాం.

    ఇంటెర్నెట్ స్పీడ్ ను పెంచుకోవాలని అనుకునే కస్టమర్లు మొదట ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తరువాత 4జీ ఆప్షన్ ను ఎంచుకుని ఎనేబుల్ చేయాలి. ఆ తరువాత యాక్సెస్ పాయింట్ నేమ్ ద్వారా నెట్వర్క్ ను ఎంచుకోవాలి. ఆ తరువాత ఆక్సెస్ పాయింట్ ను రీ సెట్ చేసుకుంటే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. ఫోన్ లో యాప్స్ ఆటో ప్లే ఆప్షన్ ను ఎంచుకుంటే డేటా స్పీడ్ పెరుగుతుంది.

    ఈ టిప్స్ ఫాలో అయినా ఇంటర్నెట్ స్పీడ్ పెరగలేదంటే ఫోన్ లేదా సిగ్నల్ ప్రాబ్లమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిగ్నల్ సమస్య అయితే మరొక నెట్వర్క్ కు మారడం లేదా ఫోన్ సమస్య అయితే రిపేర్ చేయించడం ద్వారా సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.